కార్తీక పౌర్ణమి కథ ఆసక్తికరం.. ఆనందదాయకం.

Join Our Community
follow manalokam on social media

భారతదేశ వ్యాప్తంగా హిందువులు జరుపుకునే పండగ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. కార్తీక మాసంలో 15వ రోజున వచ్చే ఈ పండగ వెనక చాలా చరిత్ర ఉంది. హిందువులతో పాటు జైనులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండగని జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబరు 30వ తేదీన జరుగుతుంది. ఈ పండగ విశేషాలతో పాటు కథ కూడా తెలుసుకుందాం పదండి.

త్రిపురాసుర అనే రాక్షసుడిని శివుడు అంతమొందించిన సందర్భంగా కార్తీక పౌర్ణమి జరుపుకుంటారని చాలా మంది నమ్ముతుంటారు. త్రిపురాసుర అనేది ముగ్గురు రాక్షసుల కలయిక, విద్యుమ్నాలి, తారాకక్ష, విర్యావణ అనే ముగ్గురు దేవుళ్ళని ఓడించి విశ్వాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుని త్రిపుర అనే మూడు నగరాలని నిర్మించారని, అపుడు శివుడు, ఒకే ఒక్క బాణంతో ఆ ముగ్గురుని అంతమొందించాడని చెప్పుకుంటారు.

ఈ సందర్భంగా దేవతలందరూ దీపావళి జరుపుకుంటారు. దీన్నే దైవ దీపావళి అంటారు. ప్రచారంలో ఉన్న మరో కథ ప్రకారం విష్ణుదేవుడు తన మత్స్య అవతారాన్ని ఈ రోజే ప్రారంభించాడని చెబుతారు. మరో దాని ప్రకారం శివుడి కొడుకు కార్తికేయ ఈ రోజే పుట్టాడని ప్రచారంలో ఉంది.

ఇలాంటి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ కార్తీక పౌర్ణమి రోజున అందరూ చేసేది దీపాలు వెలిగించడమే. కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో దేవుడికి ప్రార్థనలు చేస్తారు. ఈ సంవత్సరం నవంబరు 30వ తేదీన జరుగుతున్న కార్తీక పౌర్ణమి ముహూర్తం విషయానికి వస్తే, నవంబరు 29వ తేదీ 12:47pm నుండి నవంబర్ 30వ తేదీ 2:59pm వరకు ఉంది.

TOP STORIES

అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది...