శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ శివ మానసపూజ స్తోత్రమ్..!

-

శ్రీశివమానస పూజ స్తోత్రం.. ఇది నిజం నేటి ఆధునిక యంత్రయుగంలో తప్పనిసరిగా మారనున్నది. దీన్ని గ్రహించే అపర శంకర అవతారంగా భావించే శ్రీ ఆదిశంకరాచార్యులు దీన్ని మనకు అందించారు. కొంత మంది నిజంగానే సమయం లేకుండా వుంటారు, అందుకే అందరికోసం శంకరభగవత్పాదులు
అద్భుతమైన స్తోత్రం ఒకటి ఇచ్చారు అదే “శివ మానస పూజ స్తోత్రం”*
దీనిని చదువుకుంటే ఈశ్వరుడికి అన్ని ఉపచారాలు చేసేసినట్టే అని పెద్దల అభిప్రాయం.

శ్రీ శివ మానస స్తోత్రం.
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యామ్బరం
నానారత్నవిభూషితం మృగమదామోదాఙ్కితం చన్దనమ్
జాతీచమ్పకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ !!
సౌవర్ణే నవరత్నఖణ్డరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పఞ్చవిధం పయోదధియుతం రమ్భాఫలం పానకమ్ ।
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖణ్డోజ్జ్వలం
తామ్బూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు !! 2 !!
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలమ్
వీణాభేరిమృదఙ్గకాహలకలా గీతం చ నృత్యం తథా ।
సాష్టాఙ్గం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తంమయా
సఙ్కల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః ।
సఞ్చారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శమ్భో తవారాధనమ్4
కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్
విహితమవిహితం వా* *సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవశమ్భో ॥ 5॥

ఈ పవిత్రమైన మానసపూజను కార్తీకమాసంలో పారాయణం చేస్తే తప్పక శివానుగ్రహం కలుగుతుంది. ఏ సమయంలోనైనా దీన్ని పారాయణం చేయవచ్చు. మనస్సుతో చేసేదీనికి శుచి, శుభ్రత అవసరం లేదు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news