ఫ్లాష్ ఫ్లాష్: నందమూరి అన్నదమ్ములు రావడం లేదు!

-

ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న టీడీపీ వర్చువల్ మహానాడులో నందమూరి వారసుల హడావిడి ఏమాత్రం లేదు! అక్కడ నందమూరి తారకరామారావు విగ్రహం మినహా ఆయన వారసుల హడావిడి అభిమానులు ఆశించినట్లుగా లేదు! ఇది కొంతమంది టీడీపీ నాయకులకు, నారావారి అభిమానులకు ఆనందమేనేమో కానీ… నందమూరి అభిమానులకు మాత్రం పూర్తి నిరాసతో కూడుకున్న వ్యవహారం! ఈ మహానాడు వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ కానీ, కల్యాణ్ రాం కానీ హాజరూయ్యే పరిస్థితి లేదు! వారికి ఆహ్వానాలు కూడా అందాయా అంటే కన్ఫాం గా చెప్పడం కష్టం! ఈ క్రమంలో నందమూరి అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్ తాజాగా తెలిసింది!

నందమూరి తారకరామారావు జయంతి రోజు (మే 28)న ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ లోని ఎన్టీయార్ ఘాట్‌ ను సందర్శించి నివాళులర్పిస్తుంటారు! అయితే ప్రస్తుత లాక్‌ డౌన్ కారణంగా ఈ ఏడాది జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం ఎన్టీయార్ ఘాట్ వద్ద కాకుండా ఇంటి దగ్గరే ఎన్టీయార్‌ కు నివాళులర్పించాలని జూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు నిర్ణయించుకున్నారట!

ఈ మేరకు ప్రముఖ పీఆర్వో, నిర్మాత మహేష్ కోనేరు ట్విటర్ ద్వారా… జూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు గురువారం ఎన్టీయార్ ఘాట్‌ కు రావడం లేదని తెలియజేశారు. “ప్రజలు, అభిమానుల భద్రత దృష్ట్యా ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్ రేపు ఎన్టీయార్ ఘాట్‌ కు రావడం లేదు.. రామారావుగారికి ఇంటి దగ్గరే నివాళులు అర్పిస్తారు.. లాక్‌ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా గుంపులు గుంపులుగా ఉండకూడదనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు” అని ట్వీట్‌ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news