ఇండియాలో అడుగు పెట్టడానికి పబ్ జీ ప్లాన్…!

-

ఇండియాలో పబ్ జీ బ్యాన్ చేసిన తర్వాత యువతకు పిచ్చి పట్టిన పరిస్థితి. ఒకరకంగా చెప్పాలి అంటే జీవితంలో తాము ఏదో కోల్పోయామనే భావనలోనే వారు ఉన్నారు. అయితే కొంత మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఆటను బ్యాన్ చేసిన తర్వాత కూడా దానికి ప్రత్యామ్నాయం వెతుక్కుని… మరీ ఆడుతున్నారు. అయితే గత నెలలో పబ్ జీ సర్వర్లు పూర్తిగా మూసేశారు. దీనితో ఈ గేమ్ ప్రేమికులకు భారతదేశంలో ఆడటం అసాధ్యం అని నిపుణులు చెప్తున్నారు.

అయితే సర్వర్లు మూసేసిన తర్వాత కూడా ఈ ఆట ఇండియాలో రావడానికి ప్లాన్ చేస్తుంది అని ఒక టెక్ సంస్థ చెప్పింది. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం… యూజర్ డేటా గోప్యత మరియు భద్రత గురించి భారత ప్రభుత్వ ఆందోళనలను తొలగించడానికి గానూ పబ్ జీ సంస్థ… గత కొన్ని వారాలుగా… గ్లోబల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లతో దేశంలోని భారతీయ వినియోగదారుల డేటాను దేశంలో నిల్వ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.

ఈ ఏడాది చివరిలోపు భారతదేశంలో తిరిగి ఈ గేమ్ ని ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు… ఈ సంస్థ దేశంలోని కొన్ని ఉన్నత స్థాయి స్ట్రీమర్‌ లకు వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై పబ్ జీ ఇంకా స్పందించలేదు. వచ్చే వారం ప్రారంభంలో దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని అందరూ భావిస్తున్నారు. భారతదేశంలో దీపావళి పండగను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేసుకోవాలని పబ్ జీ భావిస్తుంది అని వార్తలు వచ్చాయి. ఈ ఆటకు సంబంధించి ప్రచారం చేయడానికి పబ్ జీ, పే టీఎం, ఎయిర్టెల్ సంస్థలకు ఆసక్తి ఉందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అని గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news