పోలీసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడితే అనవసరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాని కొందరు మాత్రం పోలీసుల విషయంలో లెక్కలేని తనంగా ఉంటూ ఇబ్బందులను ఆహ్వానిస్తారు. వాహనాలు తనిఖీ చేసే సమయంలో పోలీసులకు సహకరించాలి. కాని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఇందుకు భిన్నంగా పరిస్థితి కనపడింది.
కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద కొందరు హల్చల్ చేసారు. వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ ఎస్ ఐ.. కానిస్టేబుల్ ను తిట్టారన్న కోపంతో ముగ్గురు యువకులను చితకబాదారు ఖాకీలు… వారిని అందరూ చూస్తూ ఉండగా నడిరోడ్డుపై తన్నుతూ తీసుకువెళ్ళారు. అయితే పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. వారు తిట్టారా లేదా అనే దాని మీద ఆధారాలతో ముందుకు వెళ్లి స్టేషన్ కి వెళ్ళిన తర్వాత చూడాల్సింది అని ఇలా రోడ్డు మీద కొడితే పోలీసుల మీద అభిప్రాయం మారుతుంది అంటున్నారు.