ఐటీబీపీ సాహసం.. లడఖ్‌ మంచుకొండల్లో.. 17 వేల అడుగుల ఎత్తున రెప‌రెప‌లాడిన జెండా

-

దేశవ్యాప్తంగా ఆదివారం గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. మ‌రోవైపు మంచుకొండల్లో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన ఐటీబీపీ (ఇండో టిబెటన్ బెటాలియన్ సైన్యం). గణతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా.. దాదాపు 17 వేల అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది. 10 మందికి పైగా సభ్యులు గల బృందం, లడఖ్ ప్రాంతంలోని కొండలను అధిరోహించి, అక్కడ మువ్వన్నెల జెండాను రెపరెపరాడించింది. ఈ సందర్భంగా వందేమాతరం, భారత మాతకు జై నినాదాలు చేశారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఐటీబీపీ జవాన్లు మన సరిహద్దుల్లో నిత్యం పహారా కాస్తూ దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా నెటిజన్లు వారి సేవలను గుర్తుచేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ పెద్దలు కూడా ఐటీబీపీ దళం సాహసాన్ని అభినందించారు. కాగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతన్నాయి. రాజ్ పథ్ లో జరిగిన వేడుకల్లో రుద్ర, ధ్రువ్ హెలికాప్టర్లు, స్కై గ్లాడియేటర్స్ చేసిన విన్యాసాలు, పారాచూట్ రెజిమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news