దేశవ్యాప్తంగా ఆదివారం గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇవాల్టికి 70 ఏళ్లు పూర్తై 71వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’ అని హిందీ, ఆంగ్లంలో మోదీ ట్వీట్ చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని జాతీయ యుద్ధవీరుల స్మారకాన్ని సందర్శించడంతో 90 నిమిషాల రిపబ్లిక్ డే వేడుకలు మొదలవుతాయి.
అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ప్రధాని, తదితరులు రాజ్‌పథ్‌కు బయలుదేరి వెళ్తారు. రాజ్‌పథ్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకం ఆవిష్కరణ, రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది. ఈసారి రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పాల్గొంటున్నారు.
Wishing everyone a happy #RepublicDay.
सभी देशवासियों को गणतंत्र दिवस की बहुत-बहुत बधाई।
जय हिंद!
— Narendra Modi (@narendramodi) January 26, 2020