True love story: ఇష్టానికి ప్రేమకు మధ్య నలిగిపోయిన ఓ అమ్మాయి కథ..!

-

ఫిబ్రవరి నెల అనగానే.. అందరికి ప్రేమికుల రోజు గుర్తుకువస్తుంది. ఈ నెలలో ఎన్నో ప్రేమ జంటలు ఒక్కటవబోతున్నాయి, ఎంతో మందికి ఈ ప్రేమికుల రోజు ప్రత్యేకం, పెళ్లయ్యాక ఇదే మొదటి వాలైంటైన్స్‌ డే కావొచ్చు, రిలేషన్‌షిప్‌ స్టాట్‌ చేశాక ఇదే మొదటి ప్రేమికుల రోజు కావొచ్చు..ఇలా చాలా మంది ఉంటారు. కానీ ప్రేమ ఎప్పుడు మధురంగానే కాదు.. అంతకు మించి విషాదంగా కూడా ఉంటుంది.. జ్ఞాపకాలను అయితే ఇస్తుంది.. అవి చేదు స్మృతులా, తీపి జ్ఞాపకాల అనేది వారి రిలేషన్‌షిప్‌ పైనే ఆధారపడుతుంది.. ఒక అమ్మాయి జీవితంలో ప్రేమ మిగిల్చిన విషాదం గురించి తెలుసుకుందాం.. ఇది ప్రపంచానికి తెలియని కథ.. ఒక స్త్రీ జీవితంలో నిజంగా జరిగిన కథ..శ్రద్ధగా చదవండి..!

అమ్మాయిలు ప్రేమించడానికి చాలా ఎక్కువ టైమ్‌ తీసుకుంటారు. కానీ ఒక్కసారి బ్రేకప్‌ అయ్యాక చాలా తేలిగ్గా మర్చిపోయి వేరే వాడ్ని పెళ్లి చేసుకుంటారు, లేదా వేరే అబ్బాయిని లవ్‌ చేయడం స్టాట్‌ చేస్తారు.. అమ్మాయిలకు ప్రేమ విలువ తెలియదు అని చాలా మంది అనుకుంటారు..కానీ ఇది అర్ధసత్యమే..ఒక అమ్మాయి తన జీవితంలో ఎవర్ని అయినా మనస్పూర్తిగా ప్రేమిస్తే.. తాళికట్టకుండానే ఆ అబ్బాయిని భర్తగా భావిస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకునే కథ 2019లో మొదలైంది..

అనగనగనా ఓ అమ్మాయి.. 21 ఏళ్లకు పీజీ పూర్తి చేసి..క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే జాబ్‌ తెచ్చుకుని హైదరాబాద్‌కు వచ్చింది.. అప్పటి వరకూ తన లైఫ్‌ వేరు అప్పటి నుంచి వేరు..కట్టుబాట్లు, కండీషన్ల మధ్య బతికిన ఆ అమ్మాయికి ఒక్కసారిగా ఫ్రీడమ్‌ వచ్చింది.. జాబ్‌లో జాయిన్‌ అయింది..ఆ ఆఫీస్‌లో మొత్తం మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్లను అక్కడే చూడొచ్చు..కాలేజ్‌కు వెళ్లినట్లే సరదాగా ఉండేది.. ఫ్రష్షర్‌ కాబట్టి వర్క్‌ టెన్షన్‌ ఎక్కువే ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ అల్లరే ఉంటుంది. సరదాగా గడిపేసేది..షిఫ్ట్‌లో తను ఉంటే.. సందడే సందడి.. ఎంత వర్క్‌ అయినా అలా జాలీగా చేసుకుంటూ పోయేది. ఇప్పుడు సీన్‌లోకి ఒక వ్యక్తి వచ్చాడు. తన సీనియర్‌.. ఆ అబ్బాయి కూడా అచ్చం తనలాగే.. ఉన్నచోట పదిమందిని కట్టిపడేసి గలగలా మాట్లాడేస్తాడు..పని చేసే సమయం తక్కువ.. కబుర్లు చెప్పే టైమ్‌ ఎక్కువ.. ఇద్దరికి కొద్ది రోజుల్లోనే దోస్తీ కుదిరింది..వారం రోజుల్లోనే.. ఏళ్లనాటి నుంచి తెలిసిన వాళ్లలా ఒకరికొకరు కలిసిపోయారు.. సీనియర్‌ను సైతం రా అనేంత చనువు వచ్చేసింది.. నిజానికి ఇది ప్రేమ కాదు.. పాపం ఆ పిచ్చిది ప్రేమ అనుకుంది.. ఆ అబ్బాయికి అప్పుడే 26 ఏళ్లు.. అన్నీ తెలుసు.. తనే చెప్పాడు..మన మధ్య ఉన్న రిలేషన్‌ స్నేహానికి ఎక్కువ ప్రేమకు తక్కువ.. ఇద్దరి మైండ్‌సెట్‌ ఒకేలా ఉంటుంది కాబట్టి ఇలా త్వరగా కలిసిపోయాం అని…ఆ అమ్మాయి కూడా సరే అంది…అలా వాళ్లిద్దరు ప్రేమ అనే విషయాన్ని పక్కనపెట్టి ప్రేమికుల కంటే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లు.. ఇన్నాళ్ల జీవితంలో జరిగిన సంఘటనలు, అనుభవించిన కష్టాలు, సమాజం, జీవితం ఇలా వాళ్లు మాట్లాడుకోవడానికి ఎన్నో టాపిక్స్‌.. కాలం కూడా పరుగులు తీసేది.. అంతంత సేపు మాట్లాడుకునేవాళ్లు.. వాళ్లు బయట కలుసుకున్నది కేవలం ఐదుసార్లే..ఎందుకంటే.. వీళ్ల స్నేహం మొదలైన వారానికే ఆ అబ్బాయి వేరే కంపెనీలో జాయిన్‌ అయ్యాడు. ఫోన్‌ వారి మధ్య వారధి..

ఇలా ఉండగా కరోనా వచ్చేసింది.. దూరం పెరిగింది..ఆ అబ్బాయి..ఇంటికి వెళ్లిపోయాడు.. ఫోన్లు మాట్లాడటం తగ్గించేశాడు. పాపం ఇప్పటివరకూ ఆ అబ్బాయితో మాట్లాడటానికి అలవాటు పడిన ఈ అమ్మాయి.. ఒక్కసారిగా దూరంగా ఉండేసరికి తట్టుకోలేక పోయింది..ప్రేమకు, స్నేహానికి మధ్య తేడా ఏంటో అర్థంచేసుకోని.. లేదు ఇది ప్రేమ అని కన్ఫామ్‌ చేసుకోని ఆ అబ్బాయితో చేప్పేసింది.. మనం ప్రేమికుల కంటే ఎక్కువగా ఇన్ని రోజులు మన మనసులను పంచుకున్నాం.. ఇది ఇంతవరకే ఉండాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అనుకోకు.. ఇలాంటి ఒకరోజు వస్తుందనే ముందే ప్రేమకాదని చెప్పాను అన్నాడు ఆ అబ్బాయి.. వీళ్లు మంచి స్నేహితులు, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది..కానీ బయటపడలేదు. పెళ్లి చేసుకుంటే బాగుండు అని భావన కూడా కలిగేది.. కానీ చెప్పలేదు. ఎందుకంటే.. వారి కులాలు వేరు, రాష్ట్రాలు వేరు, పెరిగిన పరిస్థితులు వేరు. వీళ్లు కలిసి బతకడానికి ఏ ఒక్కటి సహకరించదు. అందుకే ముందు నుంచే పర్టిక్యులర్‌గా ఉన్నారు. మొదట్లోనే ఆపేయొచ్చుగా అనుకున్నారు.. మనకు నచ్చిన వాళ్లతో మన జీవితంలో కొన్ని పేజీలు అయినా ఉంటే ఆ జ్ఞాపకాలు చాలా బాగుంటాయి అనుకోని.. కేవలం మెమొరీస్‌ కోసం మొదలేసిన ప్రయాణం వారిది.. ఈ ప్రయాణం కొన్ని నెలలే సాగింది.. ప్రేమ సంగతి పక్కనపెడితే.. ఒక మనిషికి బాగా అలవాటు అయిపోవడంతో.. ఆ అమ్మాయి ఎంతో బాధపడింది..కానీ వాస్తవాలను అర్థం చేసుకోవడానికి తనకు ఎక్కువ టైమ్‌ పట్టలేదు. తనకు కూడా వేరే కంపెనీలో జాబ్‌ వచ్చింది.. అది కాస్త ఇంటి నుంచే పని కావడంతో హైదరాబాద్‌ను వదిలి సొంతూరుకు వచ్చేసింది..అక్కడితో ఆ అబ్బాయి చాప్టర్‌ అయిపోయింది.

మెల్లగా రోజులు గడుస్తున్నాయి.. కొత్త జాబ్‌, ఇంట్లోనే పని.. ఆ అబ్బాయిని మర్చిపోతూ..లైఫ్‌ సాగిపోతుంది.. సీన్‌ కట్‌ చేస్తే.. పాత కంపెనీలో చేసిన ఒక వ్యక్తి ఫోన్ చేశాడు..తనకు ఈ అమ్మాయి స్టోరీ అంతా తెలుసు.. అయినా మాట్లాడేవాడు..ఒకరోజు ఆ అబ్బాయే అన్నాడు.. నీ లైఫ్‌లో నీ ఆ గతం లేకపోతే.. మనం ఇద్దరం పెళ్లి చేసుకునేపని అని.. అక్కడితో ఆగకుండా..ఈ అమ్మాయికి దగ్గర అయ్యాడు..ఒక గాయం మానడానికి మందు అవసరం.. ఆ అమ్మాయికి ఈ అబ్బాయి అప్పుడు ఒక మందులానే మారాడు..అలా కొన్ని నెలలు గడిచాయి..బానే ఉంది.. ఇద్దరు స్నేహితుల్లా మాట్లాడుకునే వాళ్లు..సంవత్సరం అయింది.. ఈ అమ్మాయికి ఇప్పుడు ఈ అబ్బాయి మీద ప్రేమ చిగురించింది.. అప్పుడు తన వయసు 24 ఏళ్లు.. 21 ఏళ్ల వయసులో కలిగిన యట్రాక్షన్‌కు ఈ వయసులో కలిగిన ప్రేమకు తేడా తెలుసు.. అప్పటికీ ఈ అబ్బాయి నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు.. నిజానికి ఈ రెండో వ్యక్తి.. ఈ అమ్మాయిని తన భార్యలానే ట్రీట్‌ చేశావాడు.. చనువుగా పిలవడం, మాట్లాడటం అన్నీ తనకు నచ్చేవి.. పెళ్లి టాపిక్‌ వచ్చేసరికి.. గతం గురించి తీశాడు.. ఎందుకంటే.. ఈ ఇద్దరు అబ్బాయిలు స్నేహితులే..నేను నిన్ను పెళ్లిచేసుకోలేను.. నువ్వు, తను లవర్స్‌ అని మా ఫ్రెండ్స్‌ సర్కిల్లో అందరికి తెలుసు అన్నాడు.. అంతేకాదు.. జరగనివి కూడా జరిగినట్లు, కళ్లరా చూసినట్లు చెప్పాడు.. ఆ అమ్మాయి గుండె పగిలిపోయింది.. ఇన్ని రోజులు ఇంత ప్రేమగా మాట్లాడే అబ్బాయి మనసులో తనపై ఇంత అసహ్యమైన ఫీలింగ్‌ ఉందని తెలిసే సరికి తట్టుకోలేక పోయింది.. అయినా పాపం ఆ అబ్బాయి అంటే ప్రాణంగా ఇష్టపడుతుంది..ఇలా తను పెళ్లి వద్దు అని ప్రేమించేవాడు.. ఈమె ఎప్పటికైనా ఒప్పుకుంటాడేమో అని తనను వదల్లేక అలానే ప్రయాణం కొనసాగించింది.. తనకు ఎంత విలువ ఇచ్చేది, ఎప్పుడూ తన ఆలోచనలతోనే బతికేది..

ఇప్పుడు 2024 వచ్చేసింది.. వాళ్ల ప్రేమకు రెండేళ్లు దాటాయి… ఈ రెండేళ్లలో ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు.. ఆ అమ్మాయి తనను చాలా ఎక్కువగా ప్రేమించేసింది.. మానసికంగా, శారీరంగా ఒక్కటయ్యారు.. ఆ అబ్బాయిని ఎంత ఇష్టంగా ప్రేమిస్తే తను ఆ పని చేయడానికి వెనగాడలేదు..కానీ ఈ సమాజం తప్పు అమ్మాయిదే అంటుంది. పెళ్లి చేసుకోను అని ఆ అబ్బాయి చెప్తున్నా ఈమె తన శరీరాన్ని త్యాగం చేసింది.. ఇక్కడ ఒక కారణం కూడా ఉంది.. ఏంటంటే.. 2022 డిసెంబర్‌లో.. ఆ అబ్బాయి వాళ్ల నాన్న చనిపోయాడు.. గుండెపోటుతో మరణించడంతో ఈ అబ్బాయి మానసికంగా ఒక డిప్రషన్‌లోకి వెళ్లిపోయాడు.. తనకు కూడా గుండెపోటు వస్తుందేమో, తాను కూడా ఇలానే చనిపోతానేమో అన్న భయం తనకు నిరంతరం వెంటాడేది.. రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోయేవాడు కాదు.. ఇంట్లో వాళ్లకు చెప్తే వాళ్లు ఇప్పటికే బాధలో ఉన్నారు. ఈ విషయం చెప్తే ఇంకా బాధపడతారు..మొత్తం ఈ అమ్మాయితోనే షేర్ చేసుకునేవాడు.. ఆ స్టేజ్‌లో ఈ అమ్మాయి తనకు ఎమోషనల్‌గా హెల్ప్‌ చేసింది. తన మైండ్‌ను మార్చడానికి చాలా ప్రయత్నించింది.. ఒక రకంగా.. ఆ భయం నుంచి బయటపడేయటానికే.. శారీరకంగా దగ్గరవ్వాల్సి వచ్చింది. అలా అయితే ఆ ఆలోచనల నుంచి త్వరగా కోలుకుంటాడన్నా ఒక్క కారణంతో ఆ అమ్మాయి అలా చేయాల్సి వచ్చింది..

జీవితంలో ఇప్పటికే రెండుసార్లు ప్రేమ విషయంలో దెబ్బతింది ఆ అమ్మాయి. మొదట అయిన గాయం చిన్నదే..నిజానికి అది గాయం కూడా కాదు..ఒక స్టేజ్‌ అంతే.. కానీ ఆ తర్వాత రెండో అబ్బాయి వల్ల ఈమె పూర్తిగా డిప్రషన్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పటికీ ఆ అబ్బాయి ప్రేమిస్తున్నా అనే మాట్లాడుతున్నాడు.. పెళ్లి మాత్రం సేసమీర చేసుకోను అంటాడు. ఈ అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునే ధైర్యం కూడా చేయలేకపోతుంది..తన ప్లేస్‌లో ఇంకో అబ్బాయిని ఊహించుకోలేక, వీడ్ని వదల్లేక.. తెలిసి తెలిసి ఎందుకు తప్పు చేశాను అని మనోవేదనతో కుంగిపోతుంది. ప్రేమ పేరుతో ఆడుకున్నాడా, లేక నిజంగానే ప్రేమించాడా తేల్చుకోలేక కనీసం ఈ విషయం తన మిత్రులకు చెప్పులేక తనలో తనే బాధపడేది..తను 2019 నుంచి ప్రేమ విషయంలో చాలా నలిగిపోయింది.. మొదట వ్యక్తి ఇష్టంతో దగ్గరయ్యాడు.. ప్రేమ అనుకునే లోపే దూరం అయ్యాడు.. రెండో వ్యక్తి ప్రేమగానే దగ్గరయ్యాడు.. పెళ్లి అనేసరికి దూరం అవ్వాలి అనుకుంటున్నాడు.. ఈ రెండు ఘటనల్లో బాధపడింది..ఈ అమ్మాయే.. ఎందుకంటే.. ఆ ఇద్దరు అబ్బాయిలు వాళ్ల నిర్ణయాలకు కట్టుబడి ఉన్నారు.. తన జీవితంలో ఇంత బాధ ఉందని తను ఎవ్వరికీ చెప్పలేదు.. నమ్మకం లేదు..ఒకటి చెప్తే ఇంకోలా అర్థం చేసుకునే సమాజం ఇది.. మోయలేని భారంతో భవిష్యత్తు మీద భయంతో తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంది. జనవరిలోనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోని చనిపోయింది. ఎవరికీ చెప్పలేదు కదా.. ఇదంతా మీకు ఎలా తెలుసు అని డౌట్‌ వస్తుందేమో.. ఎవరికీ తన ఫీలింగ్స్‌ను షేర్‌ చేసుకోవడం ఇష్టంలేని వాళ్లకు ఆ బావాలను రాయడం అలవాటుగా ఉంటుంది. ఈ అమ్మాయి తన ల్యాప్‌టాప్‌ నోట్స్‌లో తన లైఫ్‌లో జరిగిన సంఘర్షణలన్నీ రాసుకుంది.. అలా ఈ కథ వెలుగులోకి వచ్చింది..! ఐదేళ్ల బాధ ఐదు నిమిషాల్లో చెప్తే అర్థంకాదు.. కేవలం హైలెట్స్‌ సీన్స్‌ చెప్తేనే ఇదొక వ్యాసం అయింది..! పూర్తిగా చదివిన మీకు ఈ ముగ్గురిలో తప్పు ఎవరిది అనిపిస్తుంది..?

Read more RELATED
Recommended to you

Latest news