‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఇండిగో ఎయిల్ లైన్స్ బంప‌ర్ ఆఫ‌ర్‌..!

అమ్మ‌ల‌ కోసం మదర్స్ డే, నాన్న‌ల కోసం ఫాదర్స్ డే, సోదరీమణుల కోసం సిస్టర్స్ డే, మహిళల కోసం వుమెన్స్ డే… ఇలా అందరికీ ప్రత్యేకంగా ఓ రోజు ఉన్నట్టు ప్రేమికుల కోసం ప్రేమికుల రోజు ఉంది. ఆ రోజునే వాలెంటైన్స్ డే అంటారు. వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకొంటారు అన్న ప్రశ్నకు రకరకాల సమాధానాలున్నాయి. వేర్వేరు చరిత్రలున్నాయి. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే వాలెంటైన్స్ డే సందర్భంగా ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ తమ విమానాల్లో దేశంలోని పలు ప్రాంతాలకు ప్రయాణించడానికి బంప‌ర్‌ ఆఫర్లను ప్రకటించింది.

రూ.999 కే టికెట్ ను అందిస్తూ.. వాలెంటైన్స్ డే ఆఫర్ ను ఇస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా ప్రయాణికులు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఈ ఆఫర్ కోసం తమ సంస్థ మొత్తం పది లక్షల సీట్లను కేటాయించిందని తెలిపింది. ఈ ఆఫర్ టికెట్లను బుక్ చేసుకున్నవారు మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ప్రయాణించాల్సి ఉంటుందని ఇండిగో సంస్థ వెల్లడించింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే త‌క్కువ ధ‌ర టికెట్లు బుక్ చేసుకోండి..!