ఫిబ్రవరి 7 నుండి వాలెంటైన్ వీక్ ప్రారంభమైంది. ఈ వారంలో ప్రతి రోజు ప్రేమికులకు ప్రత్యేకమే. ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలై, 8న ప్రపోజ్ డే, 9న చాక్లెట్ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్ డే, 12న హగ్ డే, ఫిబ్రవరి 13న కిస్ డే. భారతదేశంలో పాశ్చాత్య సంస్కృతి వేగంగా పెరిగినప్పటికీ, బహిరంగ ప్రదేశంలో సన్నిహితంగా ఉండటం ఇంకా పెరగలేదు..ప్రస్తుతం, వాలెంటైన్స్ వీక్ జరుగుతోంది. కిస్ స్ట్రీట్ అని పిలువబడే వీధి ఒకటి ఉందని మీకు తెలుసా..? ఆ వీధిలో ఎటు చూసినా లవర్స్ ముద్దులు పెట్టుకునే దృశ్యాలే కనిపిస్తాయి..
ఈ ప్రసిద్ధ వీధి ఎక్కడ ఉంది?
ప్రేమికులకు శృంగారభరితంగా పరిగణించబడే అనేక ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రదేశాల అందాల మధ్య జంటలు ఒకరితో ఒకరు సమయం గడపాలని కోరుకుంటారు. అయితే ఒక సాధారణ వీధి జంటలలో చాలా ప్రసిద్ధి చెందింది..ఈ ప్రదేశాన్ని కిస్ స్ట్రీట్ అని పిలుస్తారు. ఈ వీధి మెక్సికోలోని గ్వానాజువాటోలో ఉంది. ఈ ప్రదేశం పెద్ద హోటల్ లేదా పర్యాటక ప్రదేశం కానప్పటికీ, ఇప్పటికీ ఇది ప్రేమికులకు ప్రసిద్ధ చెందిన ప్లేసే..ఈ వీధిని ‘అల్లీ ఆఫ్ ది కిస్’ అంటారు.
వాస్తవానికి, ‘అల్లీ ఆఫ్ ది కిస్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ వీధి చాలా ఇరుకైనది. ఒకేసారి ఒక జంట మాత్రమే ప్రవేశించవచ్చు. దీంతో ఇక్కడి ప్రజలు తమ బాయ్ఫ్రెండ్తోనో, గర్ల్ఫ్రెండ్తోనో వేచి ఉండాల్సి రావడంతో వీధి ముందు ప్రేమికుల క్యూ ఉంటుంది.
నిజానికి, ఈ ప్రదేశం గురించి ‘అల్లీ ఆఫ్ ది కిస్’ అనే పేరుతో ఒక ప్రేమ జంట గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. దీని ప్రకారం, ఒక అమ్మాయి పేద అబ్బాయితో ప్రేమలో పడింది, కానీ వారు కలవడం నిషేధించబడింది. అందుకే వారు ఈ వీధిలో గదులు అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ తమ బాల్కనీల నుంచి ముద్దులు పెట్టుకునేవారట..కాని ఈ విషయం పెద్దోళ్లకు తెలిసింది..ప్రేమ కథ విషాదకరంగా ముగిసింది. ప్రస్తుతం ఈ వీధిలో ముద్దులు పెట్టుకోవడం ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు.