ఇండియాలో పరుగులు పెట్టనున్న 2024 రెనాల్ట్ డస్టర్..హైలెట్స్‌ ఇవే

-

ఈ ఏడాది చివరి నాటికి తన 2024 డస్టర్ కారును భారత్ మార్కెట్లోకి విడుదల చేయాలని రెనాల్ట్ భావిస్తోంది. ఈ కారుపై ఎంతోమంది మోజు ఉంది.. భారత్‌లో రోనాల్డ్‌ పరుగులు పెట్టడానికి ఇంకా కొన్ని నెలలే ఉన్నాయి.. తాజా మోడల్ లోగో, డిజైన్, బ్రాండింగ్‌లలో స్వల్ప మార్పులతో డాసియా డస్టర్‌ను పోలిన డిజైన్‌తో దీన్ని భారతీయ మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఇండియన్ వేరియంట్ పవర్ట్రెయిన్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ, ప్రపంచంలోని పలు దేశాల్లో 2024 డస్టర్ మూడు ఇంజన్ ఆప్షన్స్‌తో వస్తోంది. అలాగే, భారత్‌లో ఈ 2024 రెనాల్ట్ డస్టర్ ధర వివరాలు కూడా ఇంకా వెల్లడి కాలేదు.
ఆటో వర్గాల అంచనా ప్రకారం..వాటిలో, 2024 Renault Duster మొదటి వేరియంట్ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్న 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్. ఇది 140 బిహెచ్ పి పవర్, 148 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ప్రొడ్యస్ చేస్తుంది. రెనాల్ట్ 24.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇంజన్ బ్యాటర్ పవర్ పైననే స్టార్ట్ అయ్యేలా, బ్రేక్ రీజనరేషన్ కు సపోర్ట్ చేసే 1.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ను ఇందులో అమర్చారు.
రెండవ వేరియంట్ 1.2-లీటర్, 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజన్. దీనికి మిల్లర్ సైకిల్ పై పనిచేసే 48 వి ఎలక్ట్రిక్ మోటారును జతచేశారు. ఈ రెండు ఇంజన్‌ను స్టార్ట్ చేసే సమయంలో, యాక్సిలరేషన్ సమయంలో కంబషన్ ఇంజన్‌కు సహాయపడుతుంది. దీనివల్ల సగటు ఇంధన వినియోగం తగ్గుతుంది. అలాగే, ఇందులో 0.8 కిలోవాట్ల బ్యాటరీని రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా ఛార్జ్ చేస్తారు. ఈ వేరియంట్ 4×2, 4×4 వెర్షన్లలో 6-స్పీడ్ గేర్ బాక్స్ తో లభిస్తుంది.
2024 డస్టర్‌లో పెట్రోల్, ఎల్పీజీ కాంబో ఇంజన్ వర్షన్ కూడా ఉంది. ఇందులో రెండు ట్యాంకులు ఉంటాయి. అవి ఒక్కొక్కటి 50 లీటర్ల సామర్థ్యంతో, ఒకటి పెట్రోల్ కోసం, మరొకటి ఎల్పీజీ కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఈ వేరియంట్‌లో వినియోగదారులు డ్యాష్ బోర్డ్‌లోని ఒక బటన్‌ను నొక్కడం ద్వారా పెట్రోల్ నుంచి ఎల్పీజీకి లేదా ఎల్పీజీ నుంచి పెట్రోలుకు మారవచ్చు. అయితే, ఈ ప్రత్యేక ఇంజిన్‌ను భారత మార్కెట్లో అందించకపోవచ్చని సమాచారం..
2024 డస్టర్ లో సిఎంఎఫ్-బి ప్లాట్ఫామ్ ఉంది. ఇది గతంలో శాండేరో, లోగాన్, జాగర్ వంటి మోడళ్లలో ఉపయోగించిన ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్. ఈ ప్లాట్ ఫాం ప్యాసింజర్ లగేజీ స్పేస్‌ను పెంచడమే కాకుండా ఎస్ యూవీ యొక్క విద్యుదీకరణను కూడా సులభతరం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version