సాధారణంగా ఎవరైనా రూపాయి దానం చేయమని అడిగితే కింది నుంచి పై వరకు ఒకటికి వంద సార్లు చూసి వాళ్ళ గురించి వంద మాటలు మాట్లాడుతూ ఉంటాం. అదో మాఫియా అనే వాళ్ళు కొందరు అయితే, వాళ్ళు పనులు చేసుకుని బ్రతకలేరా…? ఆస్తులు కూడబెట్టుకుని సంపాదించాలి అని చూసే వాళ్ళు మరికొందరు. పావలా గిన్నెలో వేయడానికి వంద రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు జనం.
అలాంటిది ఒక మహిళ ఏకంగా 300 కోట్లు విలువ చేసే భవనాన్ని రాసి ఇచ్చేసారు. వివరాల్లోకి వెళితే బెంగళూరులో మెజిస్ట్రిక్ ప్రాంతంలో ఒకప్పుడు లక్ష్మీ హోటల్‌గా పేరు గాంచిన ఒక భవనం ఉండేది. ఆ భవనం కొనుగోలు చేయడానికి చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నాలు చేసారు. అయితే అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆ భవనం యజమాని అయిన మీరా నాయుడు అమ్మడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు.
తన భర్త శ్రీనివాసులు నాయుడు ఎంతో కష్టపడి ఆ భవనం కట్టించారని, దాన్ని పడగొట్టి ఇంకో భవనం కడితే తనకు డబ్బు వస్తుంది గాని త్రుప్తి రాదని అందుకే దాన్ని ఒక ఆస్పత్రికి దానం చెయ్యాలి అనుకుంటున్నా అని రూ.300 కోట్ల విలువైన తన ఆస్తిని దానం చేసేసింది. క్యాన్సర్‌తో బాధపడే బాలల సంక్షేమం కోసం 32 గదులున్న ఆ భవనాన్ని ఆమె ఇచ్చేసింది. క్యాన్సర్ బాధితులకు ఉచితంగా వైద్యం చేసే శంకర్ ఆస్పత్రి నిర్వాహకులకు రాసి ఇచ్చేసారు. చికిత్స పొందిన చిన్నారులకు అక్కడ వసతి కల్పిస్తారు.