women’s day;యాంకరింగ్ తో అంధత్వాన్ని జయించింది…!

-

పట్టుదల ఉన్న వాడికి ప్రతిభ కూడా ఉంటుంది. ప్రతిభ పట్టుదల ఉంటే ఏదైనా సాధింవచ్చు. పుతుకతో వచ్చిన వైఖల్యం అయినా జీవితంలో ఎదురైన సమస్యలు అయినా ఆ రెండింటి తో జయించవచ్చు. అలానే జయించారు స్వాతీ అనే యాంకర్. పుట్టిన రెండు ఏళ్ళకే చూపు కోల్పోయినా సరే చదువు మీద ఉన్న ప్రేమతో జీవితం మీద ఉన్న పట్టుదలతో తనకు ఉన్న ప్రతిభను సాన పెడుతూ ఆమె అంచెలు అంచెలు గా పైకి ఎదిగింది.

ఒక ప్రముఖ ఛానల్ లో ఆమె యాంకర్ అయింది. చూపు లేకుండానే ఇంటర్ 85 శాతం మార్కులతో పూర్తి చేసి… ఆ తర్వాత తనంతట తానే నిలబడింది. సీఏ చదవాలనే లక్ష్యంతో ఇంటర్ లో సీఈసీ తీసుకుని, ఫ్రెండ్ ఇచ్చిన సలహామేరకు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంట్రన్స రాసి, బీఏలో చేరి, అక్కడ కూడా సాధారణ అమ్మాయి లానే చదువు కొనసాగించి ప్రముఖ తెలుగు టీవీ ఛానల్  బ్లైండ్ యాంకర్స్ కి అవకాశం ఉందని తెలుసుకుని,

దరఖాస్తు చేసుకుని… అక్కడ ఉద్యోగం సంపాదించి… ప్రముఖ ఛానల్ లో ప్రతి శనివారం రాత్రి పదిన్నరకు ప్రసారమయ్యే ‘‘వీకెండ్ సినిమా’’ ప్రోగ్రామ్ కి యాంకర్ గా సెలక్ట్ అయ్యారు ఆమె. రెండు మూడు సార్లు ఎదుటి వారు చెప్పేది విని, ఆమె రాణించారు. ఆమెను చూసి ముందు చాలా మంది స్టైల్ అనుకునే వారు. కాని ఆమె కదలకుండా యాంకరింగ్ చేసే విధానం చూసి చాలా మందికి అనుమానం వచ్చింది.

ఆ తర్వాత ఆరా తీస్తే ఆమె బ్లైండ్ అని తెలుసుకున్నారు. టీవీ లో తనను తాను చూడలేకపోయినా సరే తన స్వరం తో తన ప్రతిభతో అందరిని ఆకట్టుకుంది ఆమె. జీవితంలో లక్ష్యాన్ని సాధించడం అంటే ఏంటో ఆమె నిరూపించారు. చాలా మందికి ఆదర్శంగా నిలిచారు స్వాతీ. అలా వారంలో ఐదు రోజులు చదువుకుంటూ.. ఒకరోజు యాంకరింగ్ చేస్తు ఆమె తన ఖర్చులకు అయినా తాను సంపాదించుకునే స్థాయికి వెళ్ళారు.

Read more RELATED
Recommended to you

Latest news