Fact check: కేంద్రం నిజంగానే మన కరెంట్ బిల్లు ను మాఫీ చేయనుందా?

-

గత కొద్దిరోజులుగా వాట్సాప్ లో ఒక ఫార్వర్డ్ మెసేజ్ పెద్ద సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కరెంటు బిల్లు మాఫీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్న విషయం వైరస్ కన్నా వేగంగా పాకిపోయింది. సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి ఇంతకు ముందు వచ్చిన కరెంట్ బిల్లులు అన్నింటిని ప్రభుత్వం మాఫీ చేస్తోందని… అందుకు తగ్గట్టు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు కూడా తీసుకోనున్నాయని వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా దీనికి ‘బిజిలి బిల్ మాఫీ యోజన’ అనే ఒక పేరును కూడా తగిలలించారు. తీరా చూస్తే అదంతా అవాస్తవమని తేలిపోయింది. గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా అధిక కరెంటు బిల్లులు నమోదు కావడంతో ఆందోళనలో ఉన్న ప్రజలకు ధైర్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మాఫీ అనే పదాన్ని తీసుకొనివచ్చినప్పటికీ…. ఇప్పటికీ ఆ ప్రక్రియ ఎక్కడా అమలు కాలేదు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి అసలు దీంతో సంబంధమే లేదని తేలిపోయింది.

అసలు ఈ గొడవ అంతా ఎక్కడ మొదలైందంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అత్యధిక కరెంట్ బిల్లు నమోదైన వారికి అధిక బిల్లులను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే అది కూడా గత సంవత్సరం ఇదే నెలలో వచ్చిన బిల్లు కంటే ఎవరికైతే 100 యూనిట్లు కన్నా ఎక్కువ బిల్లు వచ్చి ఉంటదో అందులో 75శాతం బిల్లును మాఫీ చేస్తామని ప్రకటించారు. 100 నుండి 300 యూనిట్లు మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరికి 75% బిల్లు మాఫీ అవుతుంది. అది కూడా పోయిన సంవత్సరం ఇదే నెలలో వచ్చిన కరెంట్ బిల్లు కన్నా ఎక్కువ యూనిట్లు ఉన్న వారికే. ఇక 500 యూనిట్ల వరకు ఎక్కువ బిల్లు నమొదయితే కేవలం 50 శాతం బిల్లును మాత్రమే మాఫీ చేస్తామని చెప్పారు. కాని దీనిని వక్రీకరించి కేంద్ర ప్రభుత్వం తో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 1వ తేదీన ప్రతి ఒక ఇంటికి కరెంటు బిల్లు మాఫీ చేస్తారు అన్న అబద్ధపు ప్రచారం మొదలెట్టేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version