జులై 8, 2024న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల కారణంగా నిరాశ్రయులైన ప్రజలను, సహాయ శిబిరాల్లో ఉన్న ప్రజలను రాహుల్ గాంధీ కలుసుకోవడం జరిగింది.అక్కడ స్థానిక నాయకులు, కార్మికులు, వాలంటీర్లతో ఆయన మాట్లాడారు. ఈ పర్యటన మణిపూర్ లో అల్లర్లనేవి జరిగిన తర్వాత ఆయన చేసిన మూడో పర్యటనగా తెలుస్తుంది.
అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇది మొదటి పర్యటన. ఇక మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ రెండు లోక్‌సభ నియోజకవర్గాలను గెలుచుకుంది.రాహుల్ గాంధీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 2 నిమిషాల 19 సెకన్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతూ ఉంది. రాహుల్ గాంధీ ఈమధ్య మణిపూర్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగిందని న్యూస్ వైరల్ అవుతుంది.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. ఈ వీడియో నిజానికి అస్సాంకు చెందినది, 2024లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రికార్డ్ చేశారని తెలిసింది.ఈ వీడియో జనవరి 2024 నాటి వీడియో. అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వ్యక్తులకు సంబంధించిన వీడియో ఇది.అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ, మరికొందరు నాయకులు రుపోహిలో రాత్రి బస చేయడానికి అంబగన్‌లోని రెస్టారెంట్‌లో ఆగిపోయినప్పుడు ఈ సంఘటన జరిగింది.అక్కడి ప్రజలు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమగురి కాంగ్రెస్ ఎమ్మెల్యే రకీబుల్ హుస్సేన్‌ను ఉద్దేశించి ‘అన్యయ్ యాత్ర’, ‘రకీబుల్ గో బ్యాక్’ వంటి సందేశాలతో కూడిన ప్లకార్డులను కూడా కొందరు వ్యక్తులు ప్రదర్శించారు.
అప్పుడు రాహుల్ గాంధీ, ఇతర నాయకులను భద్రతా సిబ్బంది హోటల్ నుండి బయటకు పంపించడం జరిగింది. ర్యాలీ నుండి తిరిగి వస్తున్న పార్టీ కార్యకర్తల వాహనాలపై దాడి చేసిన సంఘటన కూడా అప్పుడు జరిగింది. కాబట్టి, వైరల్ అవుతున్న ఈ వీడియోలో మణిపూర్ కి సంబంధించిన ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటీవలి మణిపూర్ పర్యటనతో ఈ వీడియోలకు అసలు సంబంధం అనేది లేదు. ఈ వీడియో జనవరి 2024లో అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రికార్డ్ అయిన వీడియో అని తెలిసింది.
@RahulGandhi Ji did not face ‘Go Back’ slogans in Manipur on July 8.
The Godi propagandists are spreading an old video from Assam to create false narratives.Disinformation exposed, truth always prevails https://t.co/Z1zZNj6XM6 pic.twitter.com/RstQqQYu2l
— Ratul Kalita (@RatulKalitaINC) July 10, 2024