బటర్ తినడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు మెరుగు పడుతుందని ఒక పోస్టు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్న ఈ పోస్ట్ లో నిజమెంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పోస్టులో బట్టర్ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని..
అదే విధంగా కంటి చూపు మెరుగు పడుతుందని ఉంది. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ సోషల్ మీడియా పోస్ట్ లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. సాధారణంగా బట్టర్ ని కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు రావు. కానీ ఎక్కువ బట్టర్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి.
బటర్ లో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మంచిది. అలానే విటమిన్ ఏ మరియు విటమిన్-ఇ Age related macular degenarator (AMD) సమస్యను తొలగిస్తుంది. అయితే ఇది అన్ని కేసెస్ లో జరిగే పని కాదు. ఇది ఇలా ఉంటే మరొక డాక్టర్ దీనిపై మాట్లాడడం జరిగింది.
బటర్ లో బీటాకెరోటిన్ ఉంటుందని ఇది విటమిన్ ఏ కింద మారుతుందని చెప్పారు. విటమిన్ ఈ UV రేస్ నుండి కాపాడుతుంది. అయితే ఈ సమస్యలు అన్నీ కేవలం బటర్ తీసుకోవడం వల్ల తగ్గవని.. సరైన ట్రీట్మెంట్ ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి పాటించవద్దు అని డాక్టర్లు సూచిస్తున్నారు.