పాదయాత్రలు అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే పాదయాత్రల ఎఫెక్ట్ ప్రజల్లో అటు పార్టీల్లో మామూలుగా ఉండదు. వీటి ఆధారంగానే గతంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో నాయకులు సీఎం కుర్చీల్లో కూడా కూర్చున్నారు. ఓడిపోయిన వారు కూడా ఈ పాదయాత్రలతోనే మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఏపీలో మొన్నటికి మొన్న సీఎం జగన్ కూడా ఇదే పాదయాత్రను నమ్ముకుని భారీ విజయాన్ని సాధించారు. అంటే దీనికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తెలంగాణలో కూడా దీని క్రేజ్‌ను క్యాచ్ చేసుకునేందుకు పార్టీలు సై అంటున్నాయి. ఇక ఇప్పటికే కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తామని అప్పట్లోనే ప్రకటించినా వాస్త రూపానికి వాటిని తీసుకురాలేకపోతున్నాయి. అయితే వీరికంటే కాస్త వెనకే పాదయాత్ర సెంటిమెంట్‌ను ఎత్తుకున్న బీజేపీ మాత్రం ఆ విషయంలో దూసుకుపోతోంది. ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది.
కానీ కాంగ్రెస్ లో మాత్రం రేవంత్ తన పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేస్తాననేది ఇంకా తెలియట్లేదు. ఇక పార్టీలో కూడా ఇంకా అంతర్గత కుమ్ములాటలు కొనసాగడంతో పాదయాత్రకు అందరూ సహకరిస్తారా లేదా అనేది మాత్రం స్పష్టత లేక ఆగిపోయింని చెప్తున్నారు. ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన పార్లమెంట్ పరిధి అయిన భువనగిరి నుంచి పాదయాత్ర చేస్తానని అప్పట్లోనే అనౌన్స్ చేసినా కూడా ముందట పడలేదు. ఇక ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాదయాత్ర జెండా ఎత్తుకున్ఆన చివరకు అది కూడా ఎగరట్లేదు. దీంతో పాదయాత్రల విషయంలో బీజేపీ ఉన్నంత స్పీడుగా కాంగ్రెస్ లేదని తెలుస్తోంది.