ఫ్యాక్ట్ చెక్: ”ప్రధాన మంత్రి నారీ శక్తి యోజన” స్కీమ్ కింద మహిళలకి రెండు లక్షలు ఇస్తున్నారా..?

-

ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు పై ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే తాజాగా ఈ తరహాలో మరో వార్త వచ్చింది. అయితే ఆ వార్త నిజమా లేదంటే అది కూడా నకిలీ వార్తా అనేది ఇప్పుడు మనం చూద్దాం.

ఒక యూట్యూబ్ లో వీడియో వచ్చింది. ఆ వీడియోలో వచ్చిన వాటా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రూ.2,20,000 మహిళలకి ఇస్తోందని తెలుస్తోంది. పైగా ఈ డబ్బులు మహిళల యొక్క బ్యాంకు ఖాతాలో పడతాయని ప్రధానమంత్రి నారీ శక్తి యోజన స్కీమ్ కింద ఈ డబ్బులు వస్తున్నాయని ఆ వీడియోలో ఉంది.

అదేవిధంగా ఈ స్కీమ్ కింద 25 లక్షల రూపాయల వరకు కూడా లోన్ పొందవచ్చని ఎలాంటి గ్యారెంటీ ఇంట్రెస్ట్ లేదా సెక్యూరిటీ లేకుండా పొందొచ్చని ఉంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనేది చూస్తే… కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నారీ శక్తి యోజన స్కీమ్ ని నడిపించడం లేదని అసలు ఈ స్కీం లేదని తెలుస్తోంది.

అయితే కేంద్రం మరియు కేంద్రం యొక్క ఏజెన్సీలు కూడా ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని అంటున్నారు. అయితే ప్రజలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇలాంటివి చూసి మోసపోకూడదు. కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలు జోలికి వెళ్లొద్దు అదేవిధంగా నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news