ఫ్యాక్ట్ చెక్: ప్రధాన మంత్రి శిశు వికాస్ యోజన కింద డబ్బులొస్తున్నాయా..? నిజం ఎంత..?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

 

లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సింది మనమే. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వచ్చింది. అందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధాన మంత్రి శిశు వికాస్ యోజన స్కీమ్ కింద చిన్న పిల్లలకి డబ్బులు ఇస్తుందని పేద వాళ్ళకి డబ్బులు అందుతాయని అందులో ఉంది. ప్రధాన మంత్రి శిశు వికాస్ యోజన స్కీమ్ ద్వారా పేద వాళ్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చని విద్య కోసం, వైద్యం కోసం వాటిని పొందొచ్చని అందులో ఉంది.

అయితే నిజంగా ప్రధాన మంత్రి శిశు వికాస్ యోజన స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోందా..? ఇందులో నిజం ఎంత అనేది చూస్తే… కేంద్ర ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ ని ఏమి తీసుకు రాలేదని తెలుస్తోంది ఇది ఫేక్ వార్త మాత్రమే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. కాబట్టి అనవసరంగా ఇలాంటి వార్తలను నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news