Big Boss OTT Telugu: బిందు మాధవి సేవ్..నటరాజ్ మస్టర్‌కు కెప్టెన్ శివ పనిష్‌మెంట్‌

-

‘బిగ్ బాస్’ ఓటీటీ వర్షన్ ఎనిమిదో వారంలోకి ఎంటర్ అయింది. ప్రజెంట్ హౌజ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన బాబా మాస్టర్ తో కలుపుకుని 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. కంటెస్టెంట్స్ లో ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా, ఒకరిని సేవ్ చేస్తానని బాబా మాస్టర్ చెప్పారు.

రోల్ చేంజ్ యాక్ట్ లో భాగంగా కంటెస్టెంట్స్ ఇమిటేషన్ లో అదరగొట్టారు. పరకాయ ప్రవేశం చేసి మరి వారి స్టైల్ ఆఫ్ ఇమిటేషన్ చేశారు. హమీద నటరాజ్ మాస్టర్ ను చాలా బాగా ఇమిటేట్ చేసింది. అయితే, బాబా మాస్టర్ ఎంట్రీ పట్ల అనిల్ తో పాటు ఇతర కంటెస్టెంట్స్ కొంత భయపడ్డారని బీబీ లవర్స్ అంటున్నారు.

బాబా మాస్టర్ సర్ ప్రైజ్ చేస్తానని చెప్పడంతో కొంత గజిబిజి ఏర్పడింది. దాంతో తాను ‘ప్రైజ్’ ఇస్తానని అన్నాడు బాబా మాస్టర్. అలా చివరకు తాను సేవ్ చేయాలనుకుంటున్నది బిందు మాధవిని అని బాబా మాస్టర్ స్పష్టం చేస్తారు.

అలా బిందు మాధవ్ సేవ్ అయిపోయింది. అయితే, కంటెస్టెంట్స్ క్వశ్చన్ కు ఆన్సర్ ఇచ్చే క్రమంలో బాబా మాస్టర్ అమ్మతోడు అని చెప్పడం పట్ల అఖిల్ అభ్యంతరం చెప్పాడు. ఇక హౌజ్ లో వర్షం పడుతున్న టైంలో నటరాజ్ మాస్టర్ నిద్రపోయాడు. కుక్కలు మొరగడంతో కెప్టెన్ శివ వచ్చి..నటరాజ్ మాస్టర్ కు పనిష్ మెంట్ ఇవ్వబోయాడు. కానీ, తాను పనిష్ మెంట్ కు ఒప్పుకోబోనని నటరాజ్ మాస్టర్ అన్నాడు. అలా కొద్ది సేపు చర్చ జరిగింది.

ఇక బిగ్ బాస్ 12 వారాల్లో 8 వారాలు పూర్తయ్యాయి. కాబట్టి గేమ్ ఇప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని బీబీ లవర్స్ పేర్కొంటున్నారు. అయితే, బిందు మాధవిని కావాలనే నామినేషన్ నుంచి సేవ్ చేశారని కొందరు బీబీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఎంటర్ టైన్మెంట్ కా బాప్ బాబా మాస్టర్.. ఎంట్రీతో ఇంటి సభ్యులలో ఉత్సాహం వచ్చేసిందని చెప్పొచ్చు. బాబా మాస్టర్ హెల్దీ కామెడీతో బీబీ లవర్స్ కు బోలెడంత ఎంటర్ టైన్మెంట్ అయితే అందుతోందని పలువురు రివ్యుయర్స్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news