ఫ్యాక్ట్ చెక్: అరటిపండ్ల వీడియో వైరల్… అసలు నిజమేంటంటే..?

-

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. అటువంటి ఫేక్ వార్తలను విని ఆచరిస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్, ఉద్యోగాలకు సంబంధించిన ఫేక్ వార్తలను ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం విన్నాం. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో అరటిపండ్లుకి సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారింది.

అరటి పండ్ల తొక్కలు తీసుకుంటే దాని నుంచి తెల్లటి పురుగులు బయటకు వస్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియో వాట్సాప్, ట్విట్టర్ మరియు సోషల్ మీడియా సైట్లలో వైరల్ అయ్యింది. సోషల్ మీడియా ఖాతాదారులు వీటిని షేర్ కూడా చేస్తున్నారు. అయితే అరటి పండ్లు సోమాలియా నుంచి వచ్చాయని వీటిల్లో విష పురుగులు ఉన్నాయని.. తొక్క తీస్తే అవి బయటికి వస్తున్నాయి అని అందులో ఉంది.

తాజాగా 500 టన్నులు అరటిపండ్లు సోమాలియా నుంచి వచ్చాయని హెలికోబాక్టర్ అనే పురుగులు అందులో ఉన్నాయి అని వీటిని తీసుకుంటే డయేరియా, వాంతులు, తలనొప్పి, వికారం వంటివి వస్తాయని ఉంది. తీసుకున్న 12 గంటలకి బ్రెయిన్ డెత్ తో మరణిస్తారని కూడా ఉంది. అయితే ఈ వీడియోలో నిజమెంత అనేది చూస్తే.. హైదరాబాద్ కి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వీటిని పరిశీలించారు.

ఆయనకి 15 ఏళ్ల అనుభవం ఉంది. అయితే హెలికోబ్యాక్టర్ అనేది అసలు పురుగు కాదు. అది ఒక రకమైన బ్యాక్టీరియా. ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్లో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా కడుపులో యాసిడ్ ఎక్కువ అవుతుంది. అయితే ఈ వీడియోలో ఏమాత్రం నిజం లేదని అసలు హెలికోబాక్టర్ అనేది పురుగు కాదని స్పష్టం అయింది. కాబట్టి ఇలాంటి ఫేక్ వార్తల్ని అస్సలు నమ్మొద్దు. షేర్ చెయ్యద్దు.

Read more RELATED
Recommended to you

Latest news