వారిని ఆపడం కష్టమే…అఫ్గాన్‌ -న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు !

టీ20 ప్రపంచ కప్‌ లో భాగంగా ఇవాళ అఫ్ఘాన్‌ మరియు న్యూజిలాండ్‌ మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఆ రెండు జట్ల కన్నా… టీమిండియాకు చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌ ఓడితే… టీమిండియా సెమీస్‌ కు వెళుతుంది. దీంతో టీమిండియా ఫ్యాన్స్‌ అందరూ… ఆఫ్ఘానిస్తాన్‌ గెలవాలని కోరుతున్నారు.

అంతేకాదు.. చాలా క్రికెట్‌ ఫ్యాన్స్‌… ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. అఫ్గాన్‌ – న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒకవేళ అఫ్గాన్‌ చేతిలో న్యూజిలాండ్‌ ఓడిపోతే సామాజిక మాధ్యమాల్లో అనేక ప్రశ్నలు వ్యక్తమవుతాయని.. తాను ముందే ఈ విషయం గురించి చెప్పదల్చుకున్నాని అన్నాడు. అదే జరిగితే సోషల్‌ మీడియాలో మరో ట్రెండింగ్‌ న్యూస్‌ ప్రచారం అవుతుందన్నాడు షోయబ్‌ అక్తర్‌. అలాగే అఫ్గాన్‌ కన్నా న్యూజిలాండ్‌ జట్టే బలమైందని, దురదృష్టం కొద్దీ వాళ్లు ఓడితే సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను ఆపడం ఎవరివల్లా కాదన్నాడు.  కాగా.. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 ప్రారంభం కానుంది.