ఫ్యాక్ట్ చెక్: మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈ నోటీస్ ని జారీ చేసిందా…?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షెడ్యూల్ కి సంబంధించి వివరాలను తీసుకు వచ్చినట్లు ఆ వార్తలో ఉంది సోషల్ మీడియాలో ఈ వార్త తెగ షికార్లు కొడుతోంది. అయితే మరి మినిస్టరీ ఆఫ్ రైల్వేస్ ఈ నోటీసు ని జారీ చేసిందా లేదంటే ఇది నకిలీ వార్త అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ మధ్య కాలం లో ఇలాంటి వార్తలు తెగ కనబడుతున్నాయి. దీని వల్ల ఆందోళన చెందాల్సిన వస్తోంది. అయితే నిజానికి మినిస్టరీ ఆఫ్ రైల్వేస్ ఇలాంటి నోటీసును జారీ చేయలేదు. ఇది కేవలం నకిలీ వార్త మాత్రమే. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి సంబంధించి వచ్చిన నోటీస్ వట్టి ఫేక్ వార్త మాత్రమే కాబట్టి ఇది నిజం అనుకుని నమ్మకండి.

ఇలాంటి నకిలీ వార్తలు కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పైగా వచ్చిన ప్రతి వార్తని కూడా నమ్మకుండా. అది ఫేక్ వార్తా లేదంటే నిజమైన వార్తా అనేది తెలుసుకోండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి ఇది నకిలీ వార్త అని తేల్చేసింది. కాబట్టి అటువంటి నకిలీ వార్తల్ని అనవసరంగా ఇతరులకి పంపకండి.

Read more RELATED
Recommended to you

Latest news