ఫ్యాక్ట్ చెక్: బిల్ గేట్స్ టెలిగ్రామ్ యాప్ ని కొనుగోలు చేశాడా…? ఇందులో నిజమెంత..?

-

సోషల్ మీడియా లో రోజు రోజుకీ అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ తరహాలోనే తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. బిల్ గేట్స్ టెలిగ్రామ్ యాప్ ని కొనుగోలు చేశాడని వార్త వైరల్ అవుతుంది. అయితే నిజంగా బిల్ గేట్స్ టెలిగ్రామ్ మెసేజింగ్ ఆప్ ని కొనుగోలు చేశాడా…? దీనిలో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం..?

 

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సోషల్ మీడియా లో బిల్ గేట్స్ టెలిగ్రామ్ యాప్ ని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వాళ్ల పేరు ఏమీ లేదు. దానిలో కేవలం పోస్టు తాలూక స్క్రీన్ షాట్ మాత్రమే ఉంది.

అదే విధంగా 600 మిలియన్ డాలర్ల తో టెలిగ్రామ్ ని బిల్ గేట్స్ కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వినపడ్డాయి.

ఫ్యాక్ట్ చెక్:

అయితే ఈ విషయాన్ని చూస్తే.. బిల్ మరియు మెలిండా ఫౌండేషన్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ని గేట్స్ కొనుగోలు చేయడం లేదని చెప్పేసింది. అయితే ఈ కంపెనీ అమ్మడం లేదని కూడా టెలిగ్రాం స్పోక్స్ మెన్ చెప్పేశారు.

అదే విధంగా బిల్ మరియు మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఇందులో ఎంత మాత్రం నిజం లేదు అని చెప్పడం జరిగింది. అలానే టెలిగ్రాం కూడా ఈ విషయంలో నిజం లేదని స్పష్టం చేసారు అయితే సోషల్ మీడియా లో వచ్చే సమాచారం కేవలం అబద్ధం అని అందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news