ఫ్యాక్ట్ చెక్: ట్విట్టర్ లో వున్న UPSC ఖాతా ఫేక్ అకౌంటేనా..?

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ ఫేక్ వార్తలు వస్తున్నాయి. వాటిని సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా తప్పుడు సమాచారం ఎక్కువగా వినపడుతోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ నుండి ఫేక్ సమాచారం స్ప్రెడ్ అవుతోంది.

 

 

upsc

తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి సివిల్ సర్వీసెస్ పరీక్ష అప్డేట్ వచ్చింది. ఆ ట్విట్టర్ ఎకౌంట్ పేరు “UPSCIndia33”. అయితే ఈ అకౌంట్ ని ప్రభుత్వం పరిశీలించి ఇది ఫేక్ ఎకౌంట్ అని నిర్ధారించింది. ఇది అఫీషియల్ వెబ్ సైట్ కాదని.. “UPSCIndia33” అనేది అఫీషియల్ అకౌంట్ అని ప్రచారం జరుగుతోంది కానీ దీనిలో ఏ మాత్రం నిజం లేదని ఇది ఫేక్ అకౌంట్ అని తెలుస్తోంది.

కాబట్టి ఇటువంటి ఫేక్ అకౌంట్ తో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమాచారం కరెక్ట్ గా ఉండదు. యూపీఎస్సీ కి అసలు ట్విట్టర్ లో అకౌంట్ లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ విద్యార్థులని ఫారిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ లో చదివిన వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఇన్స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో తీసుకు రావాలని అంది అయితే ఇది కూడా ఫేక్ అని తెలిసింది. మరొక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్ష వార్త కూడా ఫేక్ అని తెలుస్తోంది. కనుక ఇలాంటి ఫేక్ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి అని ప్రభుత్వం సూచిస్తోంది. కనుక ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మదు. ఫార్వర్డ్ చెయ్యొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news