ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులకు సుప్రీంకోర్టు షాక్ : ఎవరిచ్చారు ఆ అధికారం !

గత ఏడాది నుంచి దేశ రాజధాని అయిన ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు కార్యక్రమం పేరుతో జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తున్నారు రైతులు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం… దిగి రావడం లేదు. కేంద్రం తీరు కు తగ్గట్టుగానే అటు రైతులు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులు చేస్తున్న ఆందోళన పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రైతులు చేస్తున్న ఆందోళన పై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. రహదారులను దిగ్బంధించి అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని రైతులను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. వ్యవసాయ చట్టాల్ని కోర్టులో సవాలు చేశారు గా… ఇంకా ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించింది సుప్రీం కోర్టు. రైతులు ఆందోళన కారణంగా సామాన్యులకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడింది. ఇక ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.