ఫ్యాక్ట్ చెక్: ఒమీక్రాన్ వేరియంట్ పేరుతో సినిమా వుందా..? నిజమెంత..?

-

అందరినీ ఒమీక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఒమీక్రాన్ పేరు వెంటనే ఎంతో భయంగా ఉంటోంది ప్రజలకి. ఇప్పటికి భారతదేశంలో రెండు ఒమీక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఏదేమైనా ఒమీక్రాన్ వేరియంట్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. తాజాగా సోషల్ మీడియాలో ఒమీక్రాన్ వేరియంట్ కి సంబంధించిన ఒక పోస్టర్ వైరల్ గా మారింది.

 

omicron

ఈ సినిమా 1963 లో విడుదలైందని తెలుస్తుంది. అయితే నిజంగా ఒమీక్రాన్ వేరియంట్ పేరుతో ఓ సినిమా కూడా ఉందా..? దీనిలో నిజమెంత అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒమీక్రాన్ వేరియంట్ పేరుతో నిజంగా ఏదైనా సినిమా వచ్చిందా లేదా అనే విషయానికి వస్తే… డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా పోస్టర్ ని షేర్ చేసి క్యాప్షన్ ని పెట్టారు.

ఈ చిత్రం 1963 లో వచ్చింది అని కూడా రాశారు. అయితే దీనిలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. 1974లో వచ్చిన ఫేస్ ఫోర్ సినిమాని తీసుకుని ఒక పోస్టర్ ని క్రియేట్ చేయడం జరిగింది. అంతేకాని ఒమీక్రాన్ అనే సినిమా లేదు.

Image

ఫొటోషాప్ ని ఉపయోగించి ఈ ఫోటోని క్రియేట్ చేశారు కానీ సోషల్ మీడియాలో ఒమీక్రాన్ సినిమా ఉందని విపరీతంగా పోస్టర్ వైరల్ అయిపోయింది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం గా తెలుస్తోంది. ఒమీక్రాన్ వేరియంట్ పేరుతో అసలు సినిమా లేదు అనేదే నిజం.

Read more RELATED
Recommended to you

Latest news