ఫ్యాక్ట్ చెక్: anaesthetics ని వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత తీసుకుంటే మరణిస్తారా..?

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది సతమతమౌతున్నారు. అయితే వ్యాక్సిన్ చేయించుకున్న తరువాత కరోనా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు మత్తు మందుని (anaesthetics)  తీసుకుంటే ప్రాణానికి ప్రమాదమా…? దీనిలో నిజమెంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

సాధారణంగా ఏమైనా సర్జరీ లాంటివి జరిగినప్పుడు అనస్థీషియా ఇస్తారు. ఈ మత్తుమందు ఇవ్వడం వల్ల టెంపరరీగా సెన్సేషన్ ఉండకుండా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఈ మత్తుమందు ఇవ్వడం వల్ల వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళ ప్రాణానికే ప్రమాదం అన్న వార్తలు వినపడుతున్నాయి.

అయితే నిజంగా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు సర్జరీ లేదా ఇతర అవసరాల వల్ల అవి మత్తుమందుని తీసుకుంటే వాళ్లకి నిజంగా ప్రమాదమా అనేది ఇప్పుడు చూద్దాం.. డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళినా అనస్తీషియా తీసుకో వద్దని దీని వల్ల ప్రాణానికే ప్రమాదమని సోషల్ మీడియా లో ఒక పోస్ట్ వైరల్ అయిపోతుంది. కనుక వ్యాక్సిన్ వేయించుకున్న నాలుగు వారాల పాటు అనస్తీషియా తీసుకుంటే చనిపోతారని అంటున్నారు.

మా స్నేహితుడు ఒక అతను వ్యాక్సిన్ వేయించుకున్న రెండు రోజులకి డెంటిస్ట్ దగ్గరకు వెళ్లి మత్తుమందు తీసుకున్న వెంటనే చనిపోయాడని.. ఆ సోషల్ మీడియా పోస్ట్ లో ఉంది. ఇది చదివిన ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అన్నది చూస్తే..

ఇది వట్టి ఫేక్ మెసేజ్ అని దీనిలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. AIIMS డైరెక్టర్ రన్దీప్ ఈ వాట్సాప్ మెసేజ్ కేవలం ఫేక్ మెసేజ్ అని సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదని, ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు. కాబట్టి దీని కోసం భయపడటం మంచిది కాదు. అలానే అనవసరంగా ఫార్వార్డ్ కూడా చెయ్యకండి.