ప్రపంచంలో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి, ఈ విషయం అందరికీ తెలుసు. ఇక రోజూ టీవీ లలో సోషల్ మీడియాలలో చూసి తెలుసుకుంటూ ఉంటాము. ఇక తాజాగా అలంటి ఒక అరుదైన విషయం గురించి తెలుసుకుందాం. మానవుని జీవిత కాలం ఎంత ఉంటుంది…. ఒకప్పుడు అయితే సంవత్సరాలకు పైగానే జీవించేవారు, కానీ ఇప్పుడు చూస్తే 60 దాటితే గొప్ప. ఆ మధ్యలోనే ఏవో రోగాలు వచ్చి మనిషిని తీసుకెళ్ళిపోతున్నాయి. కానీ ఒక వృద్ధుడు మాత్రమే ఈ ప్రపంచంలో ఇప్పటికి ఉన్న జనాభా ప్రకారం అత్యధిక వయసు జీవించిన వాడిగా రికార్డ్ సృష్టించారు. కాగా ఈ రోజు అతనిది పుట్టిన రోజు కూడా కావడం గమనార్హం. వెనెజులా కు చెందిన జువాన్ విసెంటె పెరెజ్ అనే పురుషుడు ఇప్పటికే గిన్నీస్ బుక్ లో చోటును దక్కించుకున్నాడు.
ఈయన 1909 లో జన్మించాడు… ఆ లెక్కన చూసుకుంటే ఈ రోజుకి 114వ పుట్టినరోజును జరుపుకున్నాడు. కాగా ప్రస్తుతం జువాన్ కు 11 మంది పిల్లలు మరియు 71 మంది మనవళ్ళు మనవరాళ్లు ఉన్నారు.