జగిత్యాల పోరు..జీవన్ రెడ్డికి ఈ సారైనా ఛాన్స్ ఉంటుందా?

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల పోరు రసవత్తరంగా సాగనుంది. గత ఎన్నికల్లో పోరు వన్ సైడ్ గా జరిగింది. అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బి‌ఆర్‌ఎస్ నుంచి సంజయ్ కుమార్ పోటీ చేసి 61 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఈ మెజారిటీ ఎవరు ఊహించలేదు. కవిత ఈ స్థానంపై ఫోకస్ పెట్టి..పార్టీని గెలిపించారు.

అయితే వచ్చే ఎన్నికల్లో జగిత్యాలలో బి‌ఆర్‌ఎస్ గెలవడం ఈజీ కాదనే చెప్పాలి..ఓ వైపు బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు అనుకున్నంత పాజిటివ్ కనిపించడం లేదు. అటు జీవన్ రెడ్డి బలపడుతున్నారు. అదే సమయంలో ఇక్కడ బి‌జే‌పి కూడా ఓటు బ్యాంకు పెంచుకుంటుంది. బి‌జే‌పి నుంచి ముగ్గురు, నలుగురు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. బి‌జే‌పి కాస్త రేసులోకి వచ్చింది గాని..ప్రధాన పోటీ మాత్రం బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

ఇక ఎన్నికల సమయంలో దగ్గరపడటంతో ఎమ్మెల్యే సంజయ్ కూడా రూట్ మార్చి..ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు. పల్లె నిద్ర పేరుతో ప్రజల్లోనే ఉంటున్నారు. రోజుకో వూరిలో తిరుగుతూ..రాత్రి పూట అక్కడే నిద్రచేసి..ప్రజలతో మమేకమవుతున్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి మళ్ళీ తనని గట్టెక్కేస్తాయని సంజయ్ భావిస్తున్నారు.

ఇటు జీవన్ రెడ్డి మాత్రం..గతంలో తాను నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యే సంజయ్ వైఫల్యాలు లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్ళుతున్నారు. పైగా గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఆయనపై ఉంది. దీంతో ఈ సారి జగిత్యాల ప్రజలు తనకు అండగా నిలుస్తారని జీవన్ రెడ్డి భావిస్తున్నారు. ఇక్కడ బి‌జే‌పికి గెలిచే అవకాశాలు తక్కువే గాని..ఓట్లు ఎంతవరకు చీల్చి ఎవరికి నష్టం చేకూరుస్తుందో చెప్పలేని పరిస్తితి. చూడాలి మరి ఈ సారైనా జగిత్యాల్లో జీవన్ రెడ్డి గెలుస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news