తాత.. నువ్వు సూపరేహే..సైకిల్ పై 2500 కిలో మీటర్లు యాత్ర..

మనసులో గట్టి ఆలోచన ఉండాలి కానీ, వయస్సుతో సంబంధం లేదని ఓ 73 ఏళ్ల వ్యక్తి నిరూపించాడు. మాములుగా ఆ వయస్సులో నడవడం చాలా కష్టం. అలాంటిది సైకిల్ పై ఏకంగా 2500 కిలో మీటర్లు వెళ్ళడం అనేది మాటలు కాదు.30 పడిలో పడగానే యువకులు ముసులైపోతున్నారు. మోకాలి నొప్పులని కొందరు, నడుము నొప్పని కొందరు, తలనొప్పని మరి కొందరు..ఇలా చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నవారు రోజు రోజుకు పెరిగి పోతూన్నారు..

అలాంటి వాళ్ళకు ఆష్చర్యాన్ని కలిగిస్తూ ఓ 73 ఏళ్ల వయస్సు వ్యక్తి హిత బోధ చేశారు.ఏంటి.. నిజమా అని చాలా మంది నోర్లు వెళ్ళ బెడుతున్నారు కదూ.. కాస్త కథ లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం పదండి.పర్యావరణ పరిరక్షలో భాగంగా యువతకు అవగాహన కల్పించడానికి సైకిల్​ యాత్ర చేపట్టారు ఈ 73 ఏళ్ల యంగ్ హీరో..విషయాన్నికొస్తే అతని పేరు కిరణ్​ సేథ్​. ఈ వయసులో కూడా అతను సుమారు 1500 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణం చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు..

ఇతడు తాను చేసిన సేవలకు గాను, పద్మశ్రీ అవార్డు కూడా పొందాడు. ఇక మహా యాత్రలో దాదాపు 2500 కిలో మీటర్లు మేర ప్రయాణం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. యువతకు పర్యావరణం, సాంస్కృతిక వారసత్వం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికే ఈ సైకిల్​ యాత్రను చేస్తున్నానని చెప్పడం విశేషం.

డిసెంబరులో కిరణ్​ సేథ్​ పుదుచ్చేరి నుంచి చెన్నైకి సైకిల్ యాత్ర చేపట్టారు.. మార్చి 11, 2022న డిల్లీలోని రాజ్​ఘాట్​లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన పిదప కిరణ్​ సేథ్ తన సైకిల్ యాత్రను ప్రారంభించారు​. ఢిల్లీలో మొదలైన ఈ యాత్రలో అల్వార్​, అహ్మదాబాద్​, జైపుర్​, గోద్రా, బరోడా, మీదుగా 1500 కి.మీ ప్రయాణించి ఉజ్జయిని చేరుకున్నారు. అక్కడ ఉన్న ప్రముఖ కాలెజి విద్యార్థుల తో ముచ్చటించారు.అతని ఆరోగ్యం కూడా సైకిల్ తోక్కడం అని చెప్పాడు. నిజంగా అందరూ గర్వించదగ్గ విషయం అని చెప్పాలి…