అన్నదాతలకు అన్ని రకాల సబ్సిడీలు అందిస్తాం : రేవంత్ రెడ్డి

-

బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై కాంగ్రెస్ చేయబోతున్న యుద్ధానికి రైతులు అండగా నిలబడాలని కోరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయమని రైతులు అడుగుతుంటే ధర్నాల పేరుతో రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న రేవంత్ రెడ్డి .. పాలనాపగ్గాలు చేపట్టాక రైతుల కోసం ఏం చేయబోతున్నామన్నది రాహుల్ సభలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Bihari bureaucrats helping KCR loot Telangana, alleges Congress leader Revanth  Reddy- The New Indian Express

అన్నదాతలకు అన్ని రకాల సబ్సిడీలు అందిస్తామని రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారు. వరంగల్ సభకు రాష్ట్రంలోని రైతు కుటుంబాలన్నీ తరలిరావాలని, రాబోయే సోనియమ్మ రాజ్యంలో 2004నాటి బంగారు పాలన అందిస్తామన్నారు. కేసీఆర్ అవినీతికి అవధుల్లేకుండా పోయిందని మండిపడ్డ రేవంత్.. చివరకు యాదగిరి నర్సింహ స్వామి దేవాలయ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రూ.2 వేల కోట్లతో నిర్మించిన దేవాలయంలో కేసీఆర్ కుటుంబ అవినీతి దాగి ఉందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news