టీడీపీ అధికారిక వెబ్ సైట్ లో ఫేక్ పోస్టులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. “నేను మా అమ్మను చంపడానికి ప్రయత్నించానని పోస్టులు పెట్టారు. అది అబద్ధమని విజయమ్మ లేఖ విడుదల చేశారు. అది ఫేక్ లెటర్ అని టీడీపీ మరో పోస్టు పెట్టింది” అంటూ విమర్శించారు. గత వారం రోజులుగా వైసీపీ సోషల్ మీడియా వారియర్లను విచ్ఛలవిడిగా అరెస్టులు చేసారని ఫైర్ అయ్యారు జగన్.
ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రశ్నిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తే.. అక్రమంగా చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. వరద సాయం పేరుతో ఫుడ్ మీద రూ.534 కోట్లు, క్యాండిళ్లు, అగ్గిపెట్టెలు రూ.23కోట్లను లెక్కల్లో చూపారని విమర్శించారు. సంపద సృష్టిస్తానని చెప్పి.. జగన్ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మెస్తున్నారని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్.