అవును.. చట్టానికి ఎవరూ అతీతులు కారు.. చట్టం ముందు అందరూ సమానులే. పేదలైనా, ధనికులైనా చట్టం ముందు తలవంచాల్సిందే. అందులోనూ కరోనా లాక్డౌన్ ఉన్న సమయంలో నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. లేదంటే.. ఎంతటి వారికైనా శిక్షలు తప్పవు.. అవును.. అందుకనే ఆ వ్యక్తి కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే పోర్షె కారును నడుపుతున్నా.. అతని తండ్రి పెద్ద వ్యాపారవేత్త అని తెలిసినా.. ఆ యువకుడికి తగిన శిక్ష వేశారు. లాక్డౌన్ వేళ బయటకు వచ్చినందుకు గాను ఆ యువకుడితో అధికారులు గుంజీలు తీయించారు.
ఇండోర్లో 20 ఏళ్ల ఓ యువకుడు ఎల్లో కలర్ పోర్షె కారులో రోడ్లపై తిరుగుతుండగా.. అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని.. కరోనా లాక్డౌన్ వేళ బయటకు ఎందుకు వచ్చావ్.. అంటూ నిలదీశారు. అతను సమాధానం చెబుతున్నా వినకుండా.. అతనిచే అధికారులు గుంజీలు తీయించారు. ఈ క్రమంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది.
అయితే ఆ యువకుడి కారుకు బయట తిరిగేందుకు పాస్ ఉందట. కానీ దాన్ని ఆ అధికారులు చూడలేదని, చూడకుండానే ఆ యువకుడితో వారు గుంజీలు తీయించారని మరొక వార్త ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయంపై నెటిజన్లు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్ని కోట్లు ఖరీదు చేసే కారులో తిరిగినా.. ఇలాంటి విపత్కర సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఎవరికైనా సరే శిక్ష వేయాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు..!