వింత: 23 అడుగుల పొడవు సముద్ర జీవి…!

-

గత వారం ఒక వింత సముద్ర జీవి కనిపించింది. దాని పొడవు 23 అడుగుల కంటే ఎక్కువే. నిజంగా ఇది చాలా పెద్ద వింత జీవి. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే… ఇది వేల్స్‌లోని పెంబ్రోకెషైర్‌లోని బ్రాడ్ హెవెన్ సౌత్ బీచ్‌ లో కనిపించింది. దీని బరువు నాలుగు టన్నులు. ఇప్పటి వరకు ఈ జీవిని నిపుణులు గుర్తించలేదు. దీంతో ఇప్పుడు దీనిని సెటాసియన్ స్ట్రాండింగ్స్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రాం కి నివేదించబడింది. అయితే ఆ ప్రోగ్రాం లో పరిశీలిస్తే దాన్ని వెన్నెముక 23 అడుగుల పొడవు ఉంది. ఆన్ లైన్ లో దొరికిన ఫోటోలు ప్రకారం దీనికి గ్రే కలర్ చర్మం, మరియు దీనికి ఎముకలు వున్నాయి.

పైగా ఇది కుళ్ళిపోతుంది. దీని కారణంగా తల వంటి అవయవాలు ఏమీ కనిపించలేదు. Westfield దీని గురించి చెప్తూ ఇది కుళ్ళిన కంపు కొట్టడం వల్ల దీనిని కనుక్కోలేక పోతున్నాము అన్నారు. పైగా ఇది సముద్రంలో ఉన్నప్పుడే చచ్చిపోయింది. ఇలా ఇది చనిపోయి చాలా కాలం అయ్యి ఉండొచ్చు అంటున్నారు. ఈయన సెంపిల్స్ తీసుకుని టెస్టింగ్ కి పంపించారు అని చెప్పారు. పైగా దీని తల మిస్ అయిందా..? లేదా కుళ్ళి పోయిందా అనేది తెలియట్లేదు.

అయితే చాలా సేపు పరిశీలించాక చేసిన తర్వాత ఇది ఒక లేడీ అని చెప్పారు. దీనిని షార్క్ అని చెప్పారు. అలానే మరెంత లోతుగా పరిశీలించాక ఇది ఒక తిమింగిలం అని అన్నారు. కానీ మరింత లోతుగా పరిశీలిస్తే ఇది తిమింగలం కాదు అని తేలింది. ఇది ఒక కుళ్ళిన చేపలా వాసన వస్తోంది. దీని కారణంగా అది తిమింగలం కాదు అని చెప్పారు.

దాని యొక్క ఎముకలని చూసి ఇది తిమింగళం కాదు ఒక రకమైన చేప అని అన్నారు. దీని యొక్క పిక్చర్ తీసి… దీని యొక్క శాంపిల్స్ కూడా తీసుకున్నాను అని ఆయన చెప్పారు. నాచురల్ హిస్టరీ మ్యూజియం మరియు లండన్ జూ కి కూడా దీనిని తీసుకెళ్లడం జరిగింది అన్నారు. అయితే ఎలా చనిపోయింది అనే విషయం కూడా తెలియడం లేదు. వయసు కారణంగా చనిపోయిందా లేదా ఇతర జంతువుల వల్ల ఇది గాయ పడిందా అనేది కూడా తెలియదు. కానీ ఇది ఏ జాతి అనేది గుర్తించవచ్చు అని ఆయన చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news