నిజం గడప దాటే లోపు అబద్దం ఊరంతా తిరిగి వస్తుందనే సామెత నేటి రోజుల్లో సరిగ్గా సరిపోతుంది. అందుకే ఫేక్ న్యూస్ ను అరికట్టేందుకు గాను చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. తాజాగా ఈ మేరకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సీఎం జగన్ ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్, ట్విట్టర్ అకౌంట్ ను తన క్యాంపు ఆఫీస్ లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని.. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ పనిచేయనుందన్నారు.అసలు వాస్తవాలు ఏమిటో సాక్ష్యాలతో ఫ్యాక్ట్ చెక్ తేల్చనుంది అని ఆయన అన్నారు. అలాగే దురుద్దేశ పూర్వక ఫేక్ ప్రచారం మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దురుద్దేశ పూర్వకంగానే ఈ ప్రచారం చేస్తే మొదట ఎక్కడ నుంచి మొదలయ్యిందో దాన్ని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.