హెలీకాఫ్టర్‌ సాయంతో డాక్టర్‌ వద్దకు వెళ్తున్న ఆవు.. వీడియో వైరల్‌

-

మన దేశంలో గోవులను పూజిస్తారు.. కానీ పూజించే సందర్భాల్లోనే వాటిని పూజిస్తారు.. రోడ్డు మీద వెళ్తుంటే అడ్డం వస్తే..కొడతారు కూడా కొందరు.. జంతుప్రేమికులు జంతువులను ఏంతో ప్రేమగా చూసుకుంటారు. వాటిని మనిషిలానే భావిస్తారు. ఇంటర్‌నెట్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది.. అందులో ఒక ఆవును హెలీకాఫ్టర్‌కు కట్టి తీసుకెళ్తున్నారు. ఇంత సాహసం వాళ్లు ఎందుకు చేశారో..? ఆవుకు ఏ కష్టం వచ్చిందో.. అలా తీసుకెళ్తున్నారు. అంబులెన్స్‌లో,వ్యాన్‌లో ఆవును తరలించడం తెలుసు.. ఇలా హెలీకాఫ్టర్‌తో ఆవును డాక్టర్‌ దగ్గరు తీసుకెళ్లడం ఇదే మొదటిసారి అయి ఉండొచ్చేమో..!

ఈ వీడియోలో హెలికాప్టర్ ద్వారా ఒక ఆవును ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఆవుకు గాయాలు కావడంతో హెలికాప్టర్‌లో తీసుకెళ్లి వెటర్నరీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. ఇలాంటివి ఇండియాలో కనిపించవు.. ఈ వీడియో స్విట్జర్లాండ్‌కు చెందినది. దాని అందం కారణంగా దీనిని ‘హెవెన్ ఆన్ ఎర్త్’ అని పిలుస్తారు. ఈ వీడియో @AMAZlNGNATURE అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కేవలం 23 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 29 మిలియన్లు లేదా 2.9 కోట్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 123.4k లైక్స్‌ వచ్చాయి.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత, ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఆవును ఇలా వైద్యుడి వద్దకు తీసుకెళ్తున్నారని కొందరు వినియోగదారులు నమ్మలేకపోతున్నారు. ఇది కొత్త విషయం కానప్పటికీ, ఇంతకు ముందు కూడా స్విట్జర్లాండ్‌లో ఆవులను విమానం ఎక్కించారు. 2021 సంవత్సరంలో కూడా, గాయపడిన ఆవులను హెలికాప్టర్‌లో పర్వతాల నుండి కిందికి దింపడం వంటి అనేక కేసులు నమోదయ్యాయట. ఏది ఏమైనా ఆవుల పట్ల ఇంత శ్రద్ధ, ప్రేమ చూపించడం చాలా గొప్ప విషయం..

Read more RELATED
Recommended to you

Latest news