ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను ఇప్పుడు ఎవ్వరూ ఊహించలేని పరిస్థితి నెలకొంది. కొన్ని సర్వేలు అధికార వైసీపీ అధికారంలోకి వస్తుందంటే.. మరికొన్ని సర్వేలు మాత్రం ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడిస్తున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులు ఖరారైనట్టు తెలిసిందే. కానీ ఏ స్థానం నుంచి ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలనే అంశం రేపటితో క్లారిటీ రానుంది.
ఇదిలా తాజాగా జనసేన నేత కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేయాలని ఆ పార్టీ నేత కోన తాతారావు కోరారు. ఇక్కడ మౌళిక వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఫార్మా కంపెనీలకు స్థలాలు ఇచ్చిన ప్రజలకు 15 ఏళ్లు అవుతున్నా.. ఇంకా ఉపాధి లభించలేదు. దేశంలోని అన్ని కులాలు, ప్రాంతాలు, మతాలకు చెందిన వారు ఉన్నా ఈ నియోజకవర్గం ఓ మిని ఇండియా.. అందుకే పవన్ లాంటి సమర్థుడి అవసరం గాజువాకకు ఉంది అని వెల్లడించారు.