పుట్టగానే పాలు ఇస్తున్న ఆవుదూడ ..!

-

పది రోజులు కూడా నిండని ఆవు దూడ ఎం చేస్తుంది…? తల్లి ఆవు పొదుగులో పాల కోసం రొమ్ము గుద్దుతుంది. మనం ఎక్కడైనా సరే ఇదే చూస్తాం. పది రోజుల్లో ఆ ఆవుదూడ గంతులు వేస్తూ ఎంతో ఉత్సాహంగా హుషారుగా ఉంటుంది. చూడటానికి ఎంతో సంతోషంగా ఉంటుంది. పచ్చ గడ్డి కూడా తినలేదు ఆ ఆవుదూడ. దీనితో దానికి పాలే ఆహారంగా ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కాని ఒక ఆవు దూడ, పట్టుమని పది రోజులు కూడా నిండకుండా లీటర్ల కొద్దీ పాలు ఇస్తుంది. నిజం అండీ బాబు నమ్మండి… కచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఇది నిజంగా తెలంగాణా రాష్ట్రంలో జరిగింది. తెలంగాణాలోని నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కొత్తలోలం గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆశ్చర్యంగా మారింది. పది రోజులు కూడా లేని ఆ దూడ పూటకు లీటర్ పాలు ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుంది.

మహ్మద్‌ అజారుద్దీన్‌ అనే పాడిరైతు సొంతంగా డైరీఫామ్‌ నిర్వహిస్తున్నాడు. ఓ జెర్సీ ఆవు ఐదురోజుల క్రితమే ఓ లేగదూడకు జన్మనిచ్చింది. శుక్రవారం దాని పొదుగు పెద్దది కావడాన్ని అజారుద్దీన్ గమనించాడు. దాన్ని తడిమి చూడగా ధారలా పాలు రావడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే గిన్నె తీసుకువెళ్ళి ఆ పాలు తీసాడు. దీనితో ఆ ఆవు దూడని చూడటానికి జనం తండోప తండాలుగా వస్తున్నారు. అధికారులకు కూడా ఈ వింత అర్ధం కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news