దాక్కున్న ప్రతీ ఒక్కడూ ప్రపంచ వినాశకారి గా మారడం తధ్యం !

-

చాలా మంది ఇటీవల కరోనా వైరస్ లక్షణాలు ఉన్న స్వచ్ఛందంగా బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటూ చాలామందికి ప్రమాదకరంగా మారుతున్నారు. దీంతో ఎక్కువగా వాళ్లు వాళ్ల కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు చాలా నష్ట పోవడమే కాకుండా పక్క వారికి కూడా కష్టాలు తీసుకువస్తున్నారు. తాజాగా ఇటీవల ఒక ఆటో నడుపుతున్న వ్యక్తి కి  యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ కి రావడంతో ఎమర్జెన్సీ కేసు అవటంతో వైద్యులు అంతా అతనికి చికిత్స చేశారు. కాని ఆ పరిస్థితి వైద్యులకు మరియు స్టాఫ్ నర్స్ లకు మిగతా కొంతమందికి మొత్తంగా 40 మందికి శాపంగా మారింది. యాక్సిడెంట్ కేసు కావటంతో ఎందుకైనా మంచిది అని హాస్పిటల్ యాజమాన్యం చేర్చుకునే ముందు ఆటో డ్రైవర్ మర్కజ్ ప్రార్థన సమావేశాలకు ఏమైనా వెళ్ళారా..? దానితో… ఏమైనా లింకుందా అని వైద్యులు ప్రశ్నించారు. అయితే ఆ కుటుంబ సభ్యులు అసలు సంబంధం లేదని అబద్ధం చెప్పారు.  దీంతో ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లే టైములో యాక్సిడెంట్ అయిన వ్యక్తికి జ్వరం రావడంతో డాక్టర్లకు అనుమానం వచ్చి కరోనా వైరస్ టెస్ట్ చేయించారు. టెస్టుల్లో పాజిటివ్ రావడంతో డాక్టర్ల అంత వణికిపోయారు.

 

హాస్పిటల్ కి చాలా మంది వచ్చారు వెళ్లారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని… ఒక పక్క భయం తో మరో పక్క తమకి ఏమవుతుందని ఆందోళన చెందారు. తర్వాత సదరు కుటుంబ సభ్యులను చాలా గట్టిగా వైద్యులు ప్రశ్నించగా…. మర్కజ్ ప్రార్థన సమావేశాలకు వెళ్లారని నిజం ఒప్పుకున్నారు. అయితే వాళ్లు దాచిన నిజానికి ఇప్పుడు 40 మంది డాక్టర్ లతో సహా క్వారంటైన్ కి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏదిఏమైనా కరోనా పాజిటివ్ లక్షణాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కడు వాస్తవాన్ని దాచి పెడితే ప్రపంచానికి ఒక వినాశకర రంగా మారతారని…పాజిటివ్ లక్షణాలు కలిగిన వ్యక్తి నెలకు దాదాపు 400 మందికి ఆ వైరస్ ని అంటించే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు బాగుండాలని అనుకుంటున్న ఇంటిలో వాళ్ళు క్షేమంగా ఉండాలని భావిస్తున్న వెంటనే లక్షణాలు ఉంటే ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news