బలాదూర్ గా తిరిగే గాడిదకు పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేశారు..!

-

సాధారణంగా ఊళ్లలో పడి తిరిగే గాడిదలను మనం చూస్తూనే ఉంటాం. కానీ.. వాటి ఆలనాపాలనా చూసుకుంటామా? ఎహ్.. మనదే సక్కగ లేదు. ఇక.. ఆ గాడిదలను ఎవడు పట్టించుకుంటాడు అంటారా? మీరు అలాగే అంటారు కానీ.. కర్ణాటకలోని మైసూరుకు సమీపంలో హురా గ్రామ ప్రజలు అలా అనుకోలేదు. ఊరిలో ఒంటరిగా తిరుగుతూ.. ఊరి గ్రామస్తులపై దాడి చేస్తున్న గాడిదకు పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాలనుకున్నారు.

గ్రామస్తులంతా కలిసి 20 వేల దాకా సేకరించి దాని కోసం ఓ ఆడ గాడిదను వెతికే పనిలో పడ్డారు. అయితే.. వాళ్ల గ్రామానికి సమీపంలో ఓ ఆడ గాడిద దొరకడంతో దానికి ఆ బలాదూర్ మగ గాడిదతో మూడు ముళ్లు వేయించారు. ఆ గాడిదల పెళ్లిని ఘనంగా జరిపించారు. వాళ్లు జమ చేసుకున్న డబ్బులతోనే ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లికి అతిథులను కూడా పిలిచారు. మనుషుల పెళ్లిలాగానే సంప్రదాయ బద్ధంగా పురోహితుడిని పిలిచి మంత్రోచ్చారణల మధ్య వాటి పెళ్లి చేసి ఆశీర్వదించారు. పెళ్లికి వచ్చిన అతిథులకు స్వీట్లు పంచిపెట్టారు. బాగుంది కదా.. ఇక.. ఈ గాడిదల పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version