‘మెగా’ చరిత్రకు 40 ఏళ్లు..!

-

తెలుగు పరిశ్రమలో ఎన్.టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు ఇలా ప్రముఖుల పేర్లు వినిపిస్తాయి. వారి తర్వాత తెలుగు సిని పరిశ్రమ దశ దిశ మార్చిన కథానాయకుడు కొణిదెల శివశంకర వర ప్రసాద్ అలియాస్ చిరంజీవి. ప్రాణం ఖరీదు సినిమా నుండి ఖైది నంబర్ 150 వరకు స్క్రీన్ పై మెగాస్టార్ మ్యాజిక్ అందరికి తెలిసిందే. సరిగ్గా 40 ఏళ్ల కిందట అంటే సెప్టెంబర్ 22, 1978లో చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమా రిలీజైంది. మొదలు పెట్టింది పునాది రాళ్లు అయినా రిలీజైంది మాత్రం ప్రాణం ఖరీదే.

నేటితో 40 ఏళ్ల సినిమా కెరియర్ ముగించుకుని 41వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు చిరంజీవి. 85 ఏళ్ల తెలుగు సిని పరిశ్రమలో 4 దశాబ్ధాలుగా టాలీవుడ్ కెరియర్ కొనసాగిస్తున్నారు చిరంజీవి. మొదట విలన్ గా చిన్న పాత్రలేస్తూ తన ఈజ్ చూపిస్తూ దర్శకుల కంట్లో పడిన చిరంజీవి ఏయన్నార్ తర్వాత డ్యాన్స్ లో మెలికలు తిరుగుతూ బ్రేక్ డ్యాన్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు.

ఇప్పటికి యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేసేందుకు సిద్ధం అంటున్నారు చిరంజీవి. ఈ 40 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన సినిమాలు.. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమాతో మరోసారి మెగా స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version