ఫారో దీవులలో షూట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వాతావరణ శాఖ అధికారులను కూడా ఆశ్చర్య పరుస్తుంది. సాధారణంగా నీరు ఎక్కడ చూసినా సరే పై నుంచి కిందకు ప్రవహిస్తుంది. కాని గురుత్వాకర్షణకు భిన్నంగా ఈ వీడియోలో నీటి ప్రవాహాన్ని పైకి ప్రవహిస్తుంది. 41 ఏళ్ళ సామీ జాకబ్‌సెన్ అనే వ్యక్తి ఈ వీడియోని చిత్రీకరించాడు. ఫారో దీవులలోని సురోయ్ కొండల వెంట
నడుస్తున్నప్పుడు అతను ఈ అసాధారణమైన దృశ్యాన్ని చూశాడు. యాహూ న్యూస్ దీనిపై కథనం ప్రచురించింది. గత సోమవారం బంధించిన ఈ వీడియోలో, సముద్రంలో నీటి సుడిగాలి పెరగడంతో ఆ నీరు కొండపైకి ప్రవహిస్తుంది. దీనిపై వాతావరణ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పలువురు శాస్త్రవేత్తలు దీన్ని చూసి ఇదొక అభ్భుతం అంటూ కొనియాడారు. “ఆపరేషన్స్ సెంటర్లో మాకు ఇది ఒక సుడిగాలిలాగా ఉంటుంది,
కాని ఇది నీటి మీద ఏర్పడుతుందని, సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త గ్రెగ్ డ్యూహర్స్ట్ పేర్కొన్నారు. “ఈ ప్రాంతంలోని వాతావరణం భారీ జల్లులతో అలజడిగా ఉంటుంది. అక్కడి పరిస్థితులు కలిసి నీటి చిమ్ములను ఏర్పరుస్తాయని ఆయన పేర్కొన్నారు. “అవాంఛనీయ వాతావరణంలో నీటి చిమ్ములు చాలా అరుదు, కానీ అద్భుతమైన వీడియోలు మరియు ఫోటోలను తయారు చేయడానికి అవి ఏర్పడతాయని ఆయన చమత్కరించారు.