లోకేశ్, కళా వెంకట్రావులను అరెస్టు చేసిన పోలీసులు..

-

ఖాజా టోల్‌‌ప్లాజా దగ్గర నారా లోకేష్‌, కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు పర్యటనకు వెళ్లి తిరిగివస్తోన్న టీడీపీ నేతలు నారా లోకేశ్, కళా వెంకట్రావులను పోలీసులు అరెస్టు చేశారు. ఖాజ టోల్ ప్లాజా వద్ద వారిని ఆపిన పోలీసులు ముందుకు వెళ్లడానికి వీలులేదని తెలిపారు. అనంతరం అరెస్టు చేస్తున్నమంటూ వారికి నోటీసులు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు వారికి తెలిపారు.

తాను చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఎవరినీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించలేదంటూ తనను పార్టీ కార్యాలయం వద్దకు పోనివ్వాలని లోకేశ్ చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులు లోకేశ్, కళా వెంకట్రావులను అరెస్టు చేసి మంగళగిరి పార్టీ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news