Barbie Botox Treatment : సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ సెట్ చేస్తున్న అందం.. అసలేంటిది..?

-

అందం మీద అందరికీ శ్రద్ధ ఎక్కువైపోయింది. కొందరు పార్లర్‌ వరకే సరిపెట్టుకుంటుంటే ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటున్నారు. ముక్కు చిన్నగా ఉంటే పెద్దది చేసుకుంటున్నారు. పెదాలు చిన్నగా ఉంటే వాటిని పెద్దగా చేయించుకుంటున్నారు. చస్ట్‌ సైజ్‌ పెంచుకుంటున్నారు. బార్బీ బొటాక్స్‌ బ్యూటీ ట్రీట్‌మెంట్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే చాలా మంది మోడల్స్‌ బార్బీగాల్‌లా ఉండాలని లక్షలు ఖర్చుపెడుతున్నారు. ఆ తర్వాత వాళ్లు ఇంకా ఎలానో తయారువుతున్నారనుకోండి. ఈ సమయంలో బార్బీ బొటాక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ బార్బీ బొటాక్స్ అంటే ఏమిటి? దానికి సంబంధించిన విషయాల ఇప్పుడు తెలుసుకుందాం.

బార్బీ బొటాక్స్ అనేది ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్న కాస్మెటిక్ ట్రెండ్. బార్బీ డాల్ శరీర ఆకృతి ఆధారంగా చేసే ఓ కాస్మెటెక్ ట్రీట్మెంట్ ఇది. ఈ ప్రక్రియలో మెడ, భుజాలను స్లిమ్ చేసేందుకు ఇంజెక్షన్లు చేస్తారు. ప్రస్తుతం ఈ ట్రీట్మెంట్కి మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ బ్యూటీ ట్రీట్మెంట్ ద్వారా సున్నితమైన, సొగసైన బార్బీ వంటి శరీరాకృతిని పొందవచ్చు. అందుకే ప్రస్తుతం ఈ ట్రీట్మెంట్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.

ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్మెటెక్ ట్రీట్మెంట్ల గురించి విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్గా చెప్పుకునే చాలా మంది వీటి గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. బ్యూటీ ట్రీట్మెంట్కి ముందు తర్వాత అంటూ చేసే వీడియోలు తమ ఫ్యాన్స్ను, బ్యూటీ మీద ఆసక్తి ఉన్నవారిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫారమ్లలో #barbiebotox అనే హ్యాష్‌ట్యాగ్ కూడా వైరల్ అవుతోంది.

ఊపందుకున్న డిమాండ్

ఈ ట్రీట్మెంట్లో భాగంగా బొటాక్స్ను మెడ వెనుక, వీపు పై భాగంలో ఉన్న రెండు పెద్ద కండరాలలోకి ఇంజెక్ట్ చేస్తారు. భుజాల మీదుగా, వెన్నెముక మధ్య రేఖ వరకు కూడా బొటాక్స్ ఇంజెక్ట్ చేస్తారు. ఇది మృదువైన, యవ్వన రూపాన్ని ఇవ్వడానికి కండరాలను ప్రేరేపిస్తుంది. ఆ ప్రాంతంలో మంచి ఆకృతి వస్తుంది.

సాధారణంగా ఈ ట్రీట్మెంట్లను ట్రాప్టాక్స్ అంటారు. వీటిని ఎక్కువగా ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి, భంగిమను మెరుగపరచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మెడనొప్పితో బాధపడుతున్నవారికి ఇది మంచి వైద్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే దీనిని కేవలం బ్యూటీరంగంలోనే కాకుండా న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి రంగాలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా రూపురేఖల్లో కూడా మార్పును కలిగిస్తుంది.

నిపుణులు

ఎన్ని ప్రయోజనాలు అందించినప్పటికీ బొటాక్స్‌ను అధిక మోతాదులో తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ చికిత్స వల్ల ప్రాథమిక కదలికలకు అవసరమైన కండరాలను ఇది బలహీనంగా మార్చే అవకాశం ఉంది. దీనివల్ల రోజువారీ పనులు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్రస్ట్‌ ఉన్నాసరే..పూర్తిగా తెలుసుకున్నాకే స్టెప్‌ తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news