తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కకపోవడంపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డీలా పడిపోయారు. ఇక ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీ చేయనున్నారు. దీంతో టికెట్ మీద గంపెడు ఆశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భావోద్వేగానికి గురై బోర్లా పడుకొని కంట తడి పెట్టారు.
టికెట్ దక్కకపోయినప్పటికీ కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని స్పష్టం చేశారు రాజయ్య. బీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి కేసీఆర్ కి వీర విధేయుడిగా ఉన్నాను.. సీఎం కేసీఆర్ ఆశీస్సులున్నాయి. అందరూ సమన్వయం పాటించండి. దయచేసి ఎవ్వరినీ బాధ పెట్టవద్దని కార్యకర్తలనుద్దేశించే మాట్లాడే సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం కేసిఆర్ ఆశీస్సులు ఉన్నాయి. అందరూ సమన్వయం పాటించండి. తాను పసిపిల్లల డాక్టర్ అయిన నేను అంబేడ్కర్ బిక్ష వల్ల ఎమ్మెల్యే అయ్యాను. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు యదావిధిగా కొనసాగుతాయి. ప్రతి గ్రామానికి సీడీఎఫ్ కింద 3 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు ఎమ్మెల్యే రాజయ్య.