చెదపురుగులతో చట్నీ.. చీమలతో ఐస్ క్రీమ్… ఇంకా మరెన్నో వైరటీలు.. లొట్టలేసుకుంటూ తింటారట..!

-

వ్వవసాయానికి సాయం తగ్గుతుంది..నష్టాల్లో పంటలు..అప్పుల్లో రైతులు ఉన్నారు. చాలామంది అన్నదాతలు వ్యవసాయని మాని..వేరేబతుకుతెరువు చూసుకుంటున్నారు. ఇలా ఒక స్టేజ్ కి వచ్చే సరికి రైతు అనేవాడే లేకపోతే పరిస్థితి ఏంటి. అందుకేనేమో ఇప్పటినుంచే కొందరు పాక నిపుణులు మన పూర్వికులు ఆస్వాదించిన క్రిమికిటకాల భోజనాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. వీటితో కూరలు చేయటం, పచ్చళ్లు పట్టటం వంటివి తయారుచేస్తున్నారు. ఏంటి కీటకాలతో వంటఏంట్రా బాబూ అనుకుంటున్నారా..ఇది నిజమేనండి..మీరు చూడండి వేటితో ఏం ఏం చేస్తారో..

కొన్ని దశాబ్దాల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగినవారు కచ్చితంగా ఉసిళ్ల వేపుడు తినే ఉంటారు. ఇప్పటికీ ఏజెన్సీ జిల్లాల్లోని కోయ, గోండు, కొండరెడ్లు, సుగాలి, కోలం, నాయక్‌పోడ్‌, అంధ్‌ వంటి గిరిజన-ఆదివాసీ తెగలు చీమల్ని ఆహారంగా తింటాయి. జార్ఖండ్‌లోని కోడా ఆదివాసీలైతే ఆరేడు తరాలనుంచీ బెమౌట్‌ చీమలను తింటున్నారట. నిజానికి, చీమలు ఎంతో బల వర్ధకమైన ఆహారమట. ఇదంతా వింటుంటే..చైనీయులు తినే వంటలు గుర్తొస్తున్నాయ్ కదా..వాళ్లు అంతే ఎగిరేవి, పాకేవి, నడిచేవి, ఈదేవి అని తేడాలేకుకండా లాగిచ్చేస్తుంటారు.

తేనెటీగలు, కందిరీగలు, చీమలు, మిడతలు, ఉప్పు మిడతలు, తూనీగలు, చెద పురుగులు వంటివాటిని ఒకప్పుడు లొట్టలేసుకొని తినేవారట. మన పూర్వీకుల ఆహారంలో రెండు వేలకుపైగా కీటకాలుండేవి. ప్రస్తుతం, ఆ సంఖ్య ఐదొందలకు పడిపోయింది. ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఖర్జూర పురుగుల లార్వా నుంచి అద్భుతమైన వంటకాన్ని చేస్తారట.. అస్సాంలో అయితే ఎర్రచీమల లార్వాతోనూ పచ్చళ్లు పెడతారు. మన దేశంలో దాదాపు 10 రాష్ర్టాలలో 300 పైచిలుకు కీటకాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. వారిలో ఎక్కువమంది గిరిపుత్రులే.

ఇవి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..Benef

చీమలు, ఇతర తినగలిగే కీటకాల వంటల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు ఆరోగ్య నిపుణులు. బస్తర్‌ ఆదివాసీలు వండుకొనే చీమల చట్నీలో, ఈత పురుగుల కూరలో పోషక విలువలు అపారంగా ఉంటాయట. వర్షాకాలంలో వచ్చే రోగాలను తట్టుకోవడానికి ఈ బలవర్ధక ఆహారం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీలు ఆరగించే ‘చాప్‌ డా’ అనే చీమల చట్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. దీన్ని కార్పొరేట్‌ కంపెనీలు మార్కెట్‌లో అమ్ముతూ లాభాలు ఆర్జిస్తున్నాయి. చీమల పచ్చడి జ్వరం, జలుబు లాంటి అస్వస్థతలకు చక్కని మందులానూ పనిచేస్తుందనండో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫార్మిక్‌ యాసిడ్‌, ప్రొటీన్లు, క్యాల్షియం ఉండటం వల్ల మలేరియా, కామెర్ల చికిత్సలో వీటిని వాడతారట.

అయితే ‘మిగతా కీటకాలతో పాటు చీమలలోనూ మానవ శరీరానికి హాని కలిగించే పదార్థం ఏదైనా ఉందా? అనే కోణంలోనూ పరిశోధన చేయాల్సి అవసరం ఉంది’ అంటున్నారు తన్షా వోహ్రా. ఆ వైపుగానూ అధ్యయనానికి ఆమె సిద్ధం అవుతున్నారు. త్వరలోనే, ఇంకో సంచలన వార్త వింటామన్న మాట!

కీటకాలను తినండి : ఐరాస

అధిక ప్రొటీన్‌ కలిగిన కీటకాలను తినమని ఐక్య రాజ్య సమితి కూడా సిఫారసు చేస్తున్నది. ఈ నిర్ణయానికి కారణం ముంచుకొస్తున్న ఆహార కొరతే. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక ప్రకారం.. మనం నిరుపయోగంగా భావించే కీటకాలే ఆహార సంక్షోభం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించబోతున్నాయట. 2023 చివరి నాటికి తినదగిన కీటకాల ప్రపంచ మార్కెట్‌ 2 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుందని అంచనా. అమెరికాలో ఉప్పు మిడతల ప్రొటీన్‌ బార్‌లు చాలా పాపులర్‌ అట. బొద్దింకల పాలతో చేసిన ఆహారాలు కూడా కొన్ని దేశాల్లో ప్రత్యేకమైన డిష్ గా వాడతారట. కీటకాలతో రకరకాల వంటకాలను వండి వడ్డిస్తున్నారు చేయి తిరిగిన షెఫ్‌లు. మావెరిక్‌ అనే వంట నిపుణుడు అయితే, బతికున్న చీమలతో రుచికరమైన ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తాడు.

సో..మనకు ముందు ముందు ఇలాంటి పరిస్థితే వచ్చాలా ఉంది. ఇప్పటికైన పెరటిపంటలుపై దృష్టిపెట్టండి. ఎంతోమంది తమ ఇంటి పెరట్లోనే ఎన్నో రకాల కూరగాయలను పండిస్తున్నారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news