రాయలసీమ కోసం ఢిల్లీలో పోరాటం చేస్తాం : బాలకృష్ణ

-

రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తు పై సీమ నేతల సదస్సు ఇవాళ అనంతపురం లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. రాయలసీమ లో వ్యవసాయం జీవనోపాధి.. వ్యవసాయానికి నీరు కావాలనే సదస్సు ఏర్పాటు చేశామన్నారు. రాయలసీమ నీటి కోసం అవసరమైతే ఢిల్లీ కి వెళ్లి పోరాటం చేద్దామని నేతలకు పిలుపునిచ్చారు. ఒకప్పుడు రతనాల సీమ… కరవు సీమ గా ఉండడం తోనే అభివృద్ధికి నాన్న గారు కృషి చేశారని… సీమ లో బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి హంద్రీనీవా ను తెచ్చారని పేర్కొన్నారు.

మద్రాసు కు నీరు ఇవ్వడానికి తెలుగు గంగ ను తెచ్చారని.. .ఈ ప్రభుత్వానికి హంద్రీనీవా నుంచి కనీసం చెరువులకు నీరు అందించే ఆలోచన లేదని ఫైర్‌ అయ్యారు. నీరు నిర్విరామంగా ప్రవహిస్తున్న పూర్తీ స్థాయిలో చెరువులకు నీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు.

హంద్రీనీవా కింద ఆయకట్టు కు నీరు ఇవ్వలేదు.. గత ఏడాది నీళ్లు వచ్చినా ఇదే పరిస్థితి అని… కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. జిల్లాలో అన్ని చెరువులకు నీరు అందించాలి… కరవు పోయేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గోదావరి, పెన్నా అనుసంధానం జరగాలి. సీమ కు నికర జలాలు వినియోగించాలని.. నిర్లక్షానికి గురైన ప్రాంతాన్ని అభివృద్ధి లోకి తెచ్చేందుకు ఎన్ఠీఆర్, చంద్రబాబు నీళ్లు ఇచ్చేందుకు కృషి చేశారని గుర్తు చేశారు బాలయ్య.

 

 

Read more RELATED
Recommended to you

Latest news