టొమాటో కు పెరుగుత‌న్న డిమాండ్.. ట‌మాటో ఇస్తే బిర్యానీ ఫ్రీ

ట‌మాటో ధ‌రలు విప‌రీతం గా పెరుగుత‌న్న స‌మ‌యంలో ట‌మాటో కు డిమాండ్ కూడా పెరుగుతుంది. ట‌మాటో ధ‌ర కంటే బిర్యానీ ధ‌ర నే తక్కువ గా ఉంటుంది. దీంతో త‌మిళ‌నాడు రాష్ట్రం లో ఒక బిర్యానీ సెంట‌ర్ వినూత్నంగా ఆలోచించింది. త‌మ హోట‌ల్ కు కిలో గ్రాము టామాటో ఇస్తే వారికి ప్లేట్ బిర్యానీ ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చింది. లేదా బిర్యానీ కొంటే ట‌మాటో లు ఫ్రీ గా ఇస్తామ‌ని కూడా ఆఫర్ పెట్టారు.

దీంతో బిర్యానీ ప్రియులు ఎగ‌బ‌డి మరి బిర్యానీ ని కొను గోలు చేస్తున్నారు. కాగ త‌మిళ నాడు లోని చెన్నై న‌గ‌రంలో కిలో గ్రాము ట‌మాటో రూ. 150 గ‌రిష్ట స్థాయి కి చేరుకుంది. అయితే బిర్యానీ మాత్రం కేవ‌లం రూ. 100 ల‌భిస్తుంది. దీంతో ట‌మాటో పెరిగిన ధ‌ర ను ఆ బిర్యానీ సెంట‌ర్ ప‌బ్లిసిటీ కోసం ఉప‌యోగించుకుంటుంది. దీంతో గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా వారి హోట‌ల్ లో బిర్యాని అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని హోట‌ల్ నిర్వ‌హ‌కులు తెలిపారు.