ఓర్నీ… బీర్ ఇలా కూడా తాగుతారా…? వైరల్ వీడియో…!

-

మందు తాగడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్… ముఖ్యంగా యూత్ అయితే జనాలను ఆకట్టుకోవడానికి తమలో ఉన్న ప్రతిభను బయటపెడుతూ ఉంటారు. సిగరెట్లు, మందు కాస్త వింతగా తాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వాళ్లకు మంచి గుర్తింపు ఉంటుంది సోషల్ మీడియాలో. వాళ్ళ వీడియో ఏదైనా బయటకు వస్తే మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది.

చైనాకు చెందిన హెబీ పాంగ్జాయ్ అనే ఒక యువకుడు బీర్ తాగే విధానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. బీర్ తాగడంలో గొప్పేం ఉంది అంటారా…? అతను బీర్ తాగే విధానం చూస్తే అసలు సినిమా మీకే అర్ధమవుతుంది. బీర్ బాటిల్ ఎత్తితే దింపకుండా తాగడం అతని స్టైల్. బాటిల్ వెరైటీగా ఒక రౌండ్ తిప్పి నోట్లో పెట్టుకుని తాగేస్తాడు. నురగ వచ్చినా ఏది వచ్చినా సరే అతను,

కొబ్బరి నీళ్ళ మాదిరిగా తాగడం చూసి సోషల్ మీడియా ఊగిపోతుంది. బీర్ తాగిన తర్వాత అతడు తన చేతులతో సీసా మూతి మీద గట్టిగా కొట్టగానే కింది భాగం ఊడిపడుతుంది. ఇక బీర్లు ఇలా తాగడమే కాదండోయ్… కాంక్రీట్ ఇటుకలను సైతం అతను పిండి పిండి చేస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా యువత వాట్సాప్ ల్లో ఎక్కువగా స్టేటస్ లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news